...

Jaggery Benefits: వామ్మో.. బెల్లం టీతో ఇన్ని ప్రయోజనాలా?

Jaggery Benefits: బెల్లంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందుకే బెల్లాన్ని ఆయుర్వేదంలో చాలా విరివిగా వాడుతుంటారు. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, నువ్వులు సహా ఇతర ధాన్యాలతో బెల్లాన్ని కలిపి తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు టీ చాలా మంది తాగుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగే పానీయం నీరు అయితే దాని తర్వాత ఉండేది టీ మాత్రమే. అలాంటి టీని భారత్ లోనూ ఎక్కువ మంది తాగుతుంటారు.

కొందరికి టీ తాగనిదే రోజు గడిచినట్టు ఉండదు. ఎక్కువ మంది టీ తయారీలో ఎక్కువగా చక్కెర వాడుతుంటారు. తక్కువ మంది తేనె వాడి టీ తయారు చేస్తారు. చాలా చాలా తక్కువ మంది మాత్రమే టీ తయారీలో బెల్లం వాడతారు. టీని బెల్లంతో తయారు చేస్తే టీ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలతో పాటు బెల్లంలోని పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే బెల్లంతో టీని తయారు చేసుకోవడం చాలా చాలా సింపుల్. మొదట మీకు ఎంత తీపి కావాలో నిర్ధారించుకుని బెల్లాన్ని తురుముకోవాలి.

తర్వాత అల్లం ముక్కలను కచ్చ పచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే యాలకులను కూడా అలాగే దంచుకోవాలి. తర్వాల గిన్నె తీసుకుని పాలు, కొన్ని నీళ్లు, తర్వాత టీ పౌడర్ వేసుకుని మరిగించుకోవాలి. మరుగుతున్న సమయంలోనే బెల్లం తురుము, దంచి పక్కన పెట్టుకున్న అల్లం, యాలకులు వేసుకుని కాసేపు మరిగిన తర్వాత తాగేయడమే.