Big boss 6 telugu: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు గొడవలు, రచ్చ, ఆటలతో అల్లరి అల్లరిగా మారిపోయింది. కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరి రోజు కూడా పోలీసులు, దొంగలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టుబడిన మెరీనాను దొంగలు బెడ్ రూంలో వేసి లాక్ చేశారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్ లో బొమ్మలు వెతుకుతుంటుంది.
దీంతో ఆమెకు యాక్సిస్ లేదని, అలా చేయడానికి వీళ్లేదని నేహ ఫైర్ అవ్వగా.. మాటిమాటికి గుర్రు అంటే ఎట్లా అంటూ మెరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. మరో వైపు వంద రూపాయలకి ఒక బొమ్మ కొంటానంటూ గీతూ దొంగలతో డీల్ మాట్లాడుతుంది. అలాగే చివర్లో వాళ్లకు ఓ బహమతి కూడా అస్తానని చెబుతుంది.
హౌస్ లో ఉన్న వాళ్లంతా గేమ్ పై కాన్సన్ ట్రేట్ చేయగా… అర్జున్ మాత్రం శ్రీసత్య పై ఆసక్తి చూపిస్తున్నాడు. ఆమెను ముగ్గులోకి దింపేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. అయినా సరే పట్టించుకోని సత్య… హౌస్ లో అందరినీ అన్నయ్య అనే పిలుస్తానని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లు కనిపించాడు. ఇప్పటికే సత్యను తప్ప ఇంట్లో వాళ్లందరినీ సిస్టర్ అని పిలుస్తానని అర్జున్ చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. మరి వీరిద్దరి లవ్ ట్రాక్ నడుస్తుందో లేదో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.