Aakasa Veedhullo Review: సూపర్ లవ్ స్టోరీ!

Aakasa Veedhullo Review: గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడిగా, హీరోగా పరిచయం మొదటి సినిమా ఇది. ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. జూడా శాండీ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో గౌతమ్ కృష్ణ తండ్రిగా దేవి ప్రసాద్ నటించాడు. ఈ సినిమాలో గౌతమ్ కృష్ణకు తల్లిగా బాలపరాషర్ నటించింది. అలాగే కొన్ని కీలకమైన పాత్రలో సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగర్, హర్షిత గౌడ్ తదితరులు నటించారు.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ సినిమా అన్ని ప్రమోషన్స్ లను కార్యక్రమాలను పూర్తి చేసింది. అయితే నేడు గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల అయింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చూడాలి. ఈ సినిమా కథ ఈ తరం యువత కు సంబంధించింది. ఈ తరం యువత అలవాట్లకు సంబంధించింది. వారు ఆలోచించే విధానం గురించి ఈ కథలో డైరెక్టర్ చూపించారు.

Advertisement

యూత్ ఆలోచనలు ఎలా ఉంటాయి? వాటిని పెద్దలు ఎలా గ్రహిస్తారు అన్నది చూపించారు. నేటి యువత డ్రగ్స్ కు ఎలా అడిక్ట్ అవుతున్నారో ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారో చూపించారు. అలాగే ఒక అమ్మాయికి అడిక్ట్ అయ్యి తన కెరీర్ ను ఎలా పాడు చేసుకుంటున్నారు, అలాగే తల్లిదండ్రుల మాటలు వినకుండా నేటి యువత చెడు అలవాట్లకు దగ్గరవుతున్నారు అన్నది సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

Advertisement

ఇలాంటి చెడు అలవాట్లు ఉన్న యువత ఇలాంటి ఆలోచన ఉన్న యువత మంచిగా మారి తమ జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారో ఈ సినిమాలో చూపించారు. ఇలాంటి సినిమా యూత్ కి చాలా అవసరం. చేదిపోతున్న నేటి యూత్ కు ఇది స్ఫూర్తిగా ఉంటుందని చెప్పాలి. ఈ సినిమా చూసి యూత్ మంచినీ గ్రహించాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని దర్శకుడు ఈ సినిమా ద్వారా యువతకు సందేశాన్ని ఇచ్చారు.

Advertisement

రేటింగ్:3/5

Advertisement
Advertisement