Bigg Boss Season 9 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో మళ్లీ మొదలు కానుంది. ఈసారి సరికొత్తగా ట్విస్టుల మీద ట్వి్స్టులతో బిగ్‌బాస్ సీజన్ 9 రాబోతుంది. ఈ సీజన్ అతి త్వరలోనే మొదలు కానుంది.
ఎప్పటిలా కంటెస్టులను కాకుండా ఈసారి బిగ్‌బాస్‌నే ఎత్తేశారట. తాజాగా విడుదల అయిన ప్రో భారీ అంచనాలను రేకిత్తిస్తోంది. ఈ సీజన్‌లో చదరంగం కాదు.. రణరంగమే అంటూ హోస్ట్ అక్కినేని నాగార్జున చెప్పే డైలాగ్ మరింత హైప్ పెంచేసింది.
Bigg Boss Season 9 : 40 మంది ఫైనల్.. అగ్ని పరీక్షే :
అసలు ఏంటి ఈసారి బిగ్‌బాస్.. ఏం కొత్తదనం ఉండబోతుంది అనేది టీవీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్స్ చేయడం అనేది పెద్ద అగ్ని పరీక్ష లాంటిదంటూ ఒక ప్రోమోను వదిలారు. ఇప్పటికే ఈ రియాల్టీ షో కోసం దాదాపు 40 మంది కంటెస్టెంట్లను ఫైనలైజ్ చేశారట.
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో నెగ్గినవారు మాత్రమే షోలో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ టీం అద్భుతమైన ప్రోమోను రిలీజ్ చేశారు. బిగ్‌బాస్ కమింగ్ సూన్ అని కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. ఈసారి నేను కూడా బిగ్ బాస్‌లోకి వెళ్తున్నా అంటూ వెన్నెల కిషోర్ మరింత మరింత అంచనాలను పెంచేశాడు. వెన్నెల కిషోర్, నాగార్జున మధ్య సంభాషణ ఆకట్టుకుంది.
Bigg Boss Season 9 : డబుల్ హౌస్.. డబుల్ డోస్ :
బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తున్నావా? అని నాగార్జున అడగగా లేదు.. నేను ఏలడానికి వచ్చాను అంటూ వెన్నెల కిశోర్ చెప్పడం.. దానికి నీవల్ల కాదులే.. ఈసారి వెరీ టఫ్.. నేను చాలా రఫ్ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు.. ఎప్పటిలాగా బిగ్‌బాస్ కాదు.. ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ నాగార్జున బిగ్ హింట్ ఇచ్చాడు.
ఎప్పుడూ పాత సిలబస్‌తోనే కొత్త ఎగ్జామ్ రాస్తావా ఏంటి కిషోర్‌ను నాగార్జున ప్రశ్నించగా.. నేను డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌తోనే మాట్లాడుకుంటానని అంటాడు కిశోర్. ఈసారీ ఏకంగా బిగ్‌బాస్‌నే మార్చేశానంటూ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. అందరి సరదాలు తీరిపోతాయంతే.. ఈసారీ చదరంగం కాదు.. రణరంగమే.. అంటూ ప్రోమో అదిరిపోయింది..