Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ 6 త్వరలో ప్రారంభం.. అసలు కంటెస్టెంట్స్ వీళ్లే..!

Bigg Boss Telugu OTT : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి అందిరికీ విదితమే. అది అయిపోయిన క్రమంలోనే మరో రెండు నెలల్లో సీజన్ 6 ఉంటుందని ప్రకటించారు. కాగా, ఆ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా ఉంటారని కన్ఫర్మ్ చేశారు. హోస్ట్ విషయమై ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ అని బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ ఫైవ్ టైంలో నే ఫిక్స్ అయారని టాక్.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ 6ను ఓటీటీలో ప్రసారం చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్. గతంలో మాదిరిగా రోజంతా జరిగింది. గంటనో రెండు గంటలో చూపించడం కాకుండా.. ఓటీటీ వేదికగా 24 హవర్స్ చూపించేస్తుంటారు. ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ సెలక్ట్ అయినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘జబర్దస్త్’ యాంకర్ వర్షిణి ఈ లిస్ట్‌లో కన్ఫర్మ్ అయినట్లు పలు వార్తల్లో పేర్కొంటున్నారు.

Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్లు వీరేనా? :

ఆమెతో పాటు యాంకర్ శివ, ‘డీ’ షో డ్యాన్సర్ రాజు, సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య, ఉప్పల్ బాలు సెలక్ట్ అయినట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి సీజన్ సిక్స్ స్టార్ట్ అవుతుందని కూడా పేర్కొంటున్నారు. అయితే, ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది తెలియదు. ఈ విషయమై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

Advertisement

‘బిగ్ బాస్’ షో మాదిరిగా ఈ ఓటీటీ షో హండ్రెడ్ డేస్ ఉండకపోవచ్చు. కాగా, ఈ షో నిర్వహణ, ఓటీటీలో ఎందులో ప్రసారం చేస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ రానట్లుంది. 50 లేదా 80 రోజుల పాటు షో ఉంటుందని టాక్.

Read Also : 2022లో రానున్న కొత్త మూవీలు ఇవే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel