Crime news: బిహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. తల్లితా మరిది చూడాల్సిన ఓ వదిన.. సలసలా మరుగుతున్న నీటిని తీస్కెళ్లి అతని మర్మాంగంపై పోసేసింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. వదినను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పాట్నాలోని మక్సూద్ పూర్ ప్రాంతంలో మిథిలేష్ కుమార్ అనే యువకుడు తన భార్య శోభా దేవితో కలిసి నివాసం ఉంటున్నాడు. మిథిలేష్ కుమార్ అన్న రాజ్ కుమార్, వదిన స్వప్నా దేవి కూడా పక్క పోర్షషన్ లోనే ఉంటున్నారు. అయితే గతంలో అన్నాతమ్ముల్లు, తోడి కోడళ్లు అంతా కలిసే ఉండేవారు.
కానీ ఆస్తి విషయంలో గొడవలు రావడంతో.. వేరయ్యారు. అన్నాదమ్ములు ఇద్దరూ వేరు కాపురాలు పెట్టి ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. అయితే తాజాగా మళ్లీ ఆస్తి విషయంలోనే గొడవ జరిగింది. దీంతో అన్న భార్య స్వప్నా దేవి… సలసలా మరుగుతున్న నీటిని తీస్కెళ్లి.. మరిది మర్మాంగాలపై పోసింది. దీంతో మంటను తట్టుకోలేకపోయిన మిథిలేష్ కేకలు వేస్తూ… బయటకు పరుగులు తీశాడు. విషయం గుర్తించిన ఆయన భార్య వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించింది. అలాగే తోడి కోడలు స్వప్నాదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.