వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Crime News : ఆ చిన్నారికి అరుదైన వ్యాధి.. బిడ్డ బాధ చూడలేక తల్లి ఏం చేసిందంటే..?

By Ramesh Babu

Published on: July 9, 2022 6:15 PM

Updated on: July 9, 2022 5:11 PM

Follow Us

Crime News

---Advertisement---

Crime News : సాధారణంగా కొందరి పిల్లలకు పుట్టుకతోనే భయంకరమైన వింత వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి.ఇలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సరైన చికిత్స చేయించడానికి చేతిలో డబ్బు లేక ఎంతోమంది చిన్నారులను పోగొట్టుకొని కడుపు కోతతో బాధపడుతున్నారు.

Crime News
Crime News

మరి కొంతమంది చిన్నారులు పడుతున్న అవస్థలు చూడలేక తల్లితండ్రులు మానసిక క్షోబను అనుభవిస్తున్న వారు ఉన్నారు.అయితే హైదరాబాద్ కి చెందిన ఓ యువతీ మాత్రం తన కూతురు పడుతున్న బాధను చూడలేక మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

Crime News : బిడ్డను కాపాడుకోలేని ఈ జీవితం ఎందుకని.. 

పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం జహీరాబాద్ కి చెందిన పూజ అరవింద దంపతులు గత రెండు సంవత్సరాల నుంచి పాండురంగ నగర్ లో అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఏడాది క్రితం ఒక బిడ్డ జన్మించింది. ఈ చిన్నారి పుట్టిన నెలకే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడ్డారు. అయితే ఈ విషయం తెలియడంతో తన తల్లిదండ్రులు చిన్నారికి సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసే వైద్య చికిత్స అందించినప్పటికీ చిన్నారికి వ్యాధి మాత్రం తగ్గలేదు.

ఇకపోతే చిన్నారికి మెరుగైన వైద్యం అందించడానికి చేతిలో చిల్లిగవ్వలేక ఎంతో ఇబ్బంది పడ్డారు.చివరికి ఇంటి అద్దె కూడా చెల్లించుకోలేని స్థితికి రావడంతో వీరిని ఆర్థిక ఇబ్బందుల చుట్టూ ముట్టడమే కాకుండా తమ కూతురు పడుతున్న బాధను చూసి ఆ తల్లి మనసు ఎంతో బాధను అనుభవించింది. తన బిడ్డ పడుతున్న బాధను చూడలేక ఏకంగా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ చిన్నారి ఏ పాపం చేసిందని తనకు ఇలాంటి శిక్ష విధించావు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also :  Crime News : ప్రియుడిని భర్త అంటూ అతనితో ఉన్న మహిళ… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడో తెలుసా?

, , , , ,

Join our WhatsApp Channel