Brother raped his own sister : ప్రస్తుత సమాజంలో వావి వరసలకు తేడా లేకుండా పోతుంది. సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో అన్నయ్య. రెండేళ్లుగా బాలికపై లైగింక దాడి చేస్తూనే ఉన్నాడుయ. తాజాగా అమ్మాయి గర్భం దాల్చడంతో ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళకు చెందిన ఓ కుటుంబం 40 ఏండ్ల కింద నగరానికి వచ్చి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలోని కాసాని కౌస్య కాలనీలో నివాసం ఉంటుంది.
కుటుంబ యజమాని వ్యాపారి కాగా… భార్య సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వీరికి కొడుకు 17, 14 కూతురు ఉన్నారు. కొడుకు స్థానికంగా ఉన్న ఇంటర్నేషనల్ పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా… కూతురు మరో పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఆన్ లైన్ కాల్సులు నడుస్తున్నాయి. తల్లిదండ్రులు ఒక గదిలో, అన్నా చెల్లెల్లు మరో గదిలో నిద్రిస్తుండే వారు. ఈ క్రమంలో చెల్లెలను లొంగదీసుకుని సోదరుడు తన కామ వాంఛ తీర్చుకునే వాడు.
ఇలా రెండేళ్లు అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఆర్నెళ్ల క్రితం బాలిక రజస్వల కాగా.. సోదరుడు అదే పనిగా తన కామ వాంఛ తీర్చుకుంటూ ఉండటంతో బాలిక ఇటీవల గర్భం దాల్చింది. బాలిక అస్వస్థతకు గురి కావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయట పడింది. దీంతో దంపతులు 3 రోజుల క్రితం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో బాచుపల్లి పోలీసులు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also : Uttarakhand : భర్తను మోసం చేసి కన్న కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకున్న మహిళ..?