Lovers suicide: పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికుల ఆత్మహత్య..!

Lovers suicide: వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతే కాకుండా వేరే యువకుడితో పెళ్లి నిశ్యచించారు. ప్రియుడిని మర్చిపోలేని ఆమె.. అతడికి పోన్ చేసింది. మనం ఎలాగు కలిసి జీవించలేం.. కనీసం కలిసి అయినా చచ్చిపోదామంది. అందుకు అతడు కూడా ఒప్పుకోవడంతో.. ఇద్దరూ పురుగుల మందు తాగాకు. విషయం గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇద్దరూ ఈరోజు మృతి చందారు. అయితే ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది.

Advertisement

ఉత్తర కన్నడ జిల్లా హాళియాలకు చెందిన జ్యోతి అంత్రోళకర, రికేశ్ సురేష్ మిరాశిలు పట్టణంలోని ఓ కాళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇక్కడ ఏర్పడిన వీరి స్నేహం ప్రేమగా మారింది. అయితే నెల రోజుల క్రితం జ్యోతికి ఆమె తండ్రి మరో అబ్బాయితో పెళ్లి నిశ్చయించాడు. తన ప్రేమ విషయం చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వీరిద్దరూ చావులోనైనా తోడుండాలనుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు విషయం గుర్తించిన పలువురు వీరిని ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు.

Advertisement