Beggar Donation: మనుషులు చాలా రకాలుగా ఉంటారు. ఒక్కో సందర్భంలో ఒక్కోలా కూడా ప్రవర్తిస్తుంటారు. అయితే కొంత మంది సంపాదించిన డబ్బును తమ కోసం, తమ కుటుంబ కోసం మాత్రమే ఖర్చు చేస్తుంటారు. ఇతరులకు రూపాయి ఖర్చు పెట్టాలన్నా వంద సార్లు ఆలోచిస్తారు. పిసినారులుగా వ్యవవహరిస్తుంటారు. మరికొందరు మాత్రం తమ దగ్గర డబ్బులు లేకపోయినా తెగ ఖర్చు చేసేస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం తన దగ్గర డబ్బులు లేకపోయినా.. భిక్షమెత్తుకొని మరీ 50 లక్షల రూపాయను విరాళంగా ఇచ్చాడు. ఏంటీ ఇంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా.. అవును నిజమేనండి. తన కడుపులో పట్టే కాస్త అన్నం కోసం సరిపోయే డబ్బులను మాత్రమే తన వద్ద ఉంచుకొని మిగిలిన దాన్నంతా సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తుంటాడు. అయితే అతని కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన పూల్ పాండియన్ అనే 72 ఏళ్ల వృద్ధుడు బిచ్చమెత్తుకొని జీవిస్తున్నాడు. అయితే అతడు బిచ్చగాడే అయినా తని మనసు మాత్రం కోటీశ్వరుడి కంటే పెద్దది. ఇప్పటి వరకు తాను బిక్షం ఎత్తగా వచ్చిన 55 లక్షలకు పైగా డ్బబును సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు. తాజాగా సోమవారం వేలూరు కలెక్టరేట్ లో గ్రీవెన్ సెల్ కు వెళ్లి తన దగ్గర ఉన్న 10 వేల రూపాయలను కలెక్టర్ కు అందించాడు. ఈ మొత్తాన్ని శ్రీలంక తమిళులకు ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశాడు. వాళ్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని పేపర్ లో చూసే ఈ సాయం చేస్తున్నట్లు వివరించాడు.