Man built his grave: మనిషి అంటే ఓ ప్లానింగ్, ఓ డెడికేషన్, ముందు చూపు ఉండాలంటాడు రావు రమేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో. దాని అర్థం చేసే పనికి ఓ ప్లానింగ్ ఉండాలని అర్థం. ఆ డైలాగ్ పక్కాగా ఫాలో అయినట్టు ఉన్నాడు ఓ వ్యక్తి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతలా ఆ వ్యక్తి ఏమి చేసి ఉంటాడు అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇది చదవండి.
అది కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ తాలూకాలోని నంజేదేవనాపూర్ గ్రామం. ఆ గ్రామంలో 85 ఏళ్ల పుట్టనంజప్ప అనే వ్యక్తి చనిపోగా.. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసి, సమాధి చేశారు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ సమాధి కట్టించిన వ్యక్తి మృతదేహాన్ని ఇప్పుడు సమాధి చేశారు. పుట్టనంజప్పకి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డవారే. పుట్టనంజప్పకు స్వతంత్ర్య భావాలు ఎక్కువ. 20 ఏళ్ల క్రితమే తన సమాధిని తనే కట్టించుకున్నాడు. ఇసుకతో దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను చనిపోయిన తర్వాత తన సమాధి అదే చోట పాతిపెట్టాలని, అది తన కొడుకులపై ఆర్థిక భారాన్ని మోపకూడదని అనుకున్నాడు పుట్టనంజప్ప. తాను చనిపోతే తాను స్వయంగా కట్టుకున్న సమాధిలోనే తన శవాన్ని పాతిపెట్టాలని కుటుంబసభ్యులకు చెప్పాడు. పుట్టనంజప్ప 12 రోజుల క్రితం అస్వస్థకు గురై చనిపోగా.. తను కట్టుకున్న సమాధిలోనే పుట్టనంజప్పను సమాధి చేశారు కుటుంబసభ్యులు