Horoscope : ఈరోజు అనగా 27వ తేదీ బుధవారం రోజున పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈరోజు రెండు రాశుల వాళ్లు ఏ పని ప్రారంభించినా తప్పకం విజయం వరిస్తుందని చెబుతున్నారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లు ఈరోజు ఎలాంటి పని ప్రారంభించినా విజయమే వరస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందు చూపు అవసరం. దైవబలం రక్షిస్తుంది. విష్ణు సందర్శనం శుభప్రదం.
మకర రాశి.. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగల్గుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్తంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. అలాగే ఈరోజు మీరు చేయబోయే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం.
Read Also : Horoscope: ఈ మూడు రాశుల వాళ్లు మనోధైర్యంతో ఏం చేసిన లాభమే..!