Horoscope: ఈరోజు అనగా జులై 26వ తేదీ పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లు మనో ధైర్యంతో ఏం చేసినా లాభమే వస్తుందని వివరించారు. అయితే ఆ మూడు రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వాళ్లు మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కల్గుతాయి.
మిథున రాశి.. మిథున రాశి వాళ్లు మొదలు పెట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మనో దైర్యంతో మీరు వాటిని అధిగమిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. గురు, శని ధ్యానం మంచిని ఇస్తుంది.
తులా రాశి.. తులా రాశ వాళ్లు చేపట్టే పనుల్లో ఆపదలు పెరగకుండా చూస్కోవాలి. ఉద్యోగంలో ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచిది.