...

Ashwagandha Benefits : పెన్సిలిన్‌కు ధీటుగా అశ్వగంధ.. లాభాలేంటో తెలుసుకుందామా..!

Ashwagandha Benefits : పెన్సిలిన్ ను డాక్టర్లు సర్వరోగనివారిణి గా పిలుస్తారు. అయితే పెన్సిలిన్ లాగా పనిచేసే ఒక దివ్యౌషధం మన ఆయుర్వేదంలోనూ ఉంది. దాని పేరే అశ్వగంధ. ఈ మూలికను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా పిలుస్తారు. సాధారణ సమస్యలు మొదలుకొని, దీర్ఘకాలిక జబ్బుల వరకు ఎన్నింటికో దివ్యౌషధంగా పనిచేసే అశ్వగంధ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ ఆయుర్వేద షాప్ కి వెళ్ళిన మనకు అశ్వగంధ పేరుతో అనేక రకాల ఔషధాలు కనిపిస్తాయి. అల్లోపతి వైద్యంలో పెన్సిలిన్ ఎంత కీలకమో, ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ కూడా అంతే కీలకమైంది.

ashwagandha-against-penicillin-lets-find-out-the-benefits
ashwagandha-against-penicillin-lets-find-out-the-benefits

అశ్వగంధను మన ఆరోగ్యాన్ని కుదుటపరిచే ఒక జనరల్ టానిక్ లాగా చెప్పుకోవచ్చు. అశ్వగంధ మూలిక లోని ఆకులు, పువ్వులు, పండ్లు, కాండం,వేర్లు ఇలా ప్రతీ భాగంలోనూ ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. అశ్వగంధ మెటబాలిక్ రేటును పెంచేందుకు ఉపయోగపడుతుంది. అశ్వగంధ మగవాళ్లకు ఎక్కువ ఉపయోగపడే టానిక్ లాంటి ఔషధం. మగవాళ్ళ లో ఉండే హార్మోన్స్ పెరగడానికి, మెటబాలిజమ్ కి బాగా తోడ్పడుతుంది.

శరీర ఎదుగుదల కూడా బాగుంటుంది. శరీరంలో కొత్త కణాలను పుట్టించుకునే శక్తి అశ్వగంధ కు బాగా ఉంటుంది. ట్యూమర్స్ ని తగ్గించే గుణం కూడా అశ్వగంధ లో ఉంది. అశ్వగంధ లో ఆల్కలాయిడ్లు,స్టేరాయిడల్స్ లాక్టోన్స్ అనే రసాయనాలు సమృద్ధిగా ఉంటాయి. కండరాల వృద్ధి కి, నరాల బలహీనత తగ్గడానికి, ఉదర సంబంధ వ్యాధులకు, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు క్యాన్సర్ కి అశ్వగంధను మించిన ఔషధం మరొకటి లేదు.

ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సాటి. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డిప్రెసెంట్ గా అశ్వగంధ అమోఘంగా పనిచేస్తుంది. సంతానలేమి సమస్య తగ్గించుకోవడానికి అశ్వగంధ బాగా తోడ్పడుతుంది. దంతక్షయాన్ని నివారించి పళ్ళని గట్టిపరుస్తుంది. కీళ్ల నొప్పులకు, మోకాళ్ళ నొప్పులకు అశ్వగంధ ఒక చక్కని ఔషధం. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కాలేయ జబ్బులను అరికడుతుంది. రక్తపోటు, మధుమేహ వ్యాధులను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అశ్వగంధ ను ఎక్కువ మోతాదులో చాలాకాలం వాడినప్పుడు గుండె పైన,అడ్రినల్ గ్రంథుల పైన చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే థైరాయిడ్ గ్రంధి అతిగా ఉత్తేజం పొంది హైపర్ థైరాయిడ్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

Read Also : Viral Video : చెల్లి మీద ఆ బుడ్డోడికి ఉన్న ప్రేమ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!