Crime News: ఈ మధ్యకాలంలో రోజురోజుకి క్రైమ్ రేటు బాగా పెరిగిపోతోంది. భార్య భర్తల గొడవలు, ఆస్తి తగాదాలు వివాహేతర సంబంధాల కారణంగా ప్రతిరోజు ఎంతోమంది హత్యకు చేయటానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. శ్వేతా రెడ్డి అనే యువతికి 2018 లో ఫేస్బుక్ ద్వారా యష్మ కుమార్ యువకుడు పరిచయమయ్యాడు. ఆ సమయంలోనే శ్వేతకి అశోక్ అనే యువకుడితో కూడా పరిచయం ఏర్పడింది. యష్మ కుమార్ తో శ్వేత కి ఏర్పడిన పరిచయం కొంతకాలంలో ప్రేమగా మారింది.
శ్వేత అశోక్ తో కూడ ఎంతో చనువుగా ఉండేది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యష్మ కుమార్, శ్వేత ఇద్దరూ అప్పుడప్పుడు న్యూడ్ కాల్స్ కూడ మాట్లాడేవారు. కొంత కాలం నుండి శ్వేత యష్మ కుమార్ ని దూరం పెడుతోంది. దీంతో శ్వేత మీద అనుమానం వచ్చిన యశ్మ కుమార్ తనని పెళ్ళి చేసుకోమని శ్వేతను డిమాండ్ చేశాడు. ఆమె అందుకు నిరాకరించడంతో తన వద్ద న్యుడ్ కాల్స్ బయటపెడతానని ఆమెను బెదిరించాడు. దీంతో శ్వేత మొత్తం విషయాన్ని అశోక్ తో చెప్పింది.
ఎలాగైనా యశ్మ కుమార్ ను వదిలించుకోవాలని పక్కగా అతనిని చంపటానికి ఇద్దరూ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో శ్వేత, అశోక్ తో పాటూ మరొక స్నేహితుడు కార్తిక్ తో కలసి హత్య చేశారు. యశ్మ కుమార్ ని రాడ్డు తో కొట్టి దారుణంగా హత్య చేసిన తర్వత దానిని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్రయత్నం చేయటంతో అక్కడ చుట్టుపక్కల వారు గమనించారు. దీంతో అశోక్ అక్కడినుండి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి హత్యకు గల కారణాల గురించి విచారణ జరిపి హత్యకు కారణమైన శ్వేత, అశోక్, కార్తీక్ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World