Crime News: రాజస్థాన్ లో దారుణం.. బలవంతంగా యువతికి తమ్ముడితో వివాహం.. తర్వాత యువతిపై సామూహిక అత్యాచారం..

Crime News: సమాజంలో ప్రతిరోజు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యువతితో ఏర్పడిన పరిచయం వల్ల బలవంతంగా ఆమెకు తన తమ్ముడితో వివాహం జరిపించి తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫంక్షన్లో పేరు చెప్పి అమ్మాయినీ నమ్మించి.. ఆమెను తనతో పాటు తీసుకెళ్లి, తన తమ్ముడితో బలవంతంగా పెళ్లి చేశాడు. అనంతరం ముగ్గురు సోదరులు కలిసి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు.

వివరాల్లోకి వెళితే…. జగ్మాల్ అనే వ్యక్తి పోస్టాఫీసు లో పని చేసేవాడు. అతనికి రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాకు చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. జగ్మాల్ కూడా తరచూ ఆ యువతి ఇంటి వెళ్ళేవాడు. గత నెలలో జగ్మాల్ ఆమెను తన ఇంట్లో ఫంక్షన్ ఉందని, తనతో పాటు రావాలని కోరాడు. ఆ అమ్మాయిని నమ్మబలికి ఆమెను తనతో పాటు ఊరికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని బలవంతంగా తన తమ్ముడు హర్ఖా రామ్ తో పెళ్ళి చేసాడు. హర్ఖా రామ్ ఆమెను నాలుగు రోజు అత్యాచారం చేసిన అనంతరం, పని నిమిత్తం వేరే ఊరికి వెళ్ళాడు.

తన తమ్ముడు ఊరు వెళ్లిన విషయం తెలిసిన జగ్మాల్, తన తమ్ముడి భార్య అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి 45 రోజుల పాటు అత్యాచారం చేశాడు. జగ్మాల్ ఇంట్లో లేని సమయంలో అతని మరొక సోదరుడు హక్మా రామ్ కూడా ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఒకరోజు అదును చూసుకొని ఆ యువతి తన తల్లికి ఫోన్ చేసి, తన ఆచూకీ తెలిపింది. తనకు జరుగుతున్న అన్యాయం గురించి తన తల్లికి వివరించింది. ఆ తల్లి తన కూతురుని కాపాడుకోవడానికి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల సహాయంతో ఆ యువతిని కాపాడింది. విషయం తెలుసుకున్న జగ్మాల్, తన సోదరులు పరారీలో ఉన్నారు. పోలీసులు ఆ ముగ్గురి నిందితుల మీద అత్యాచారం, కిడ్నాప్ కేసు పెట్టారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.++

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel