Telugu NewsEntertainmentRajamouli Movie Mahesh Babu : రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేశ్‌తోనే... అందుకోసం ఓ ప్రాజెక్టును...

Rajamouli Movie Mahesh Babu : రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేశ్‌తోనే… అందుకోసం ఓ ప్రాజెక్టును వదులుకున్న జక్కన్న..

Rajamouli Movie Mahesh Babu : టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇది రాజమౌళి డైరెక్షన్‌లో వస్తుంది. వచ్చ సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.

ఇక ఈ మూవీలోని ఇద్దరు హీరోలు ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ను పాన్ ఇండియా స్టార్స్‌గా నిలబెట్టేందుకు రాజమౌళి ట్రై చేస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత ప్రిన్స్ మహేశ్‌తో ఓ ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు జక్కన్న రెడీ అవుతున్నారు. అందుకు సంబంధించి స్ర్కీప్ట్ రెడీ అయింది. దాదాపుగా వచ్చే ఏడాది మొదట్లోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. కానీ ఈ రెండు నెలల టైంలో తన ఫ్యామిలీ యాక్టర్ శ్రీసింహతో లో బడ్జెట్‌లో ఓ మూవీ తీయాలనుకున్నారు.

Advertisement

కానీ ప్రస్తుతం దానిని రాజమౌళి వదులుకున్నట్టు టాక్. ఓ వైపు ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్.. మరో వైపు మహేష్‌ను డైరెక్ట్ చేయడంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఇక తక్కువ టైంలో మూవీ తీయడం కష్టమని భావించిన జక్కన్న.. దానిని పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. అయితే జై సింహాకు తగిన స్క్రిప్ట్ ఎంపిక చేసి… ఓ మంచి మేకర్‌ను రంగంలోకి దించితే సరిపోతుంది కాదా అని ఆయన ఆలోచిస్తున్నారట.

ఇక ఇప్పటికే సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న ప్రిన్స్.. ఆ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ మూవీ చేయనున్నారు. అనంతరం రాజమౌళితో కలిసి పనిచేయనున్నారు. రాజమౌళి‌తో పాన్ ఇండియా ఎంట్రీకి రెడీగా ఉన్నానని మహేశ్ బాబు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. మరి వీరి ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Advertisement

Read Also Allu Arjun vs Vijay Deverakonda: బాబూ.. అభిమానులు ఇప్పుడేమంటారు?

Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

తాజా వార్తలు