...

Allu Arjun vs Vijay Deverakonda : బాబూ.. అభిమానులు ఇప్పుడేమంటారు?

Allu Arjun vs Vijay Deverakonda : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్పక విమానం’ ట్రైలర్ లాంచ్ వేడుకకు ముందు ఇరు అభిమానుల మధ్య దాదాపు యుద్ధ వాతావరణమే నెలకొంది. కానీ ‘పుష్పక విమానం’ వేడుకపై వీరిద్దరూ ఒకరిగురించి మరొకరు చెప్పిన తీరుకి ఇరు హీరోల అభిమానులు ఓ లెక్కకి వచ్చుండాలి.

Advertisement

వారిద్దరూ ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమో, ఎలాంటి అభిప్రాయం వారికి ఉందో క్లియర్‌గా చెప్పారు. మరి ఇప్పుడైనా ఈ హీరోల అభిమానులు శాంతిస్తారా? ఈవెంట్ తర్వాత ఇరు హీరోల అభిమానుల్లో ఏమైనా మార్పు వచ్చి ఉంటుందా? ముఖ్యంగా అభిమానుల మధ్య జరుగుతున్న వార్‌ని ఉద్దేశించి.. డైరెక్ట్‌గానే మాట్లాడేశారు. విజయ్ అంటే నాకు అసలు అసూయ ఉండదని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత కూడా అభిమానుల్లో మార్పు రాకపోతే ఇంక చేసేదేం లేదు.

Advertisement
Icon star Allu Arjun opinion on Rowdy Hero vijay deverakonda
Icon star Allu Arjun opinion on Rowdy Hero vijay deverakonda

ఈ వేదికపై విజయ్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘నేను నిజంగా చెబుతున్నా.. విజయ్ దేవరకొండను ప్రేమిస్తాను. అతను సెల్ఫ్ మేడ్ యాక్టర్. నటుడిగా ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు. సొంతంగా కష్టపడి పైకొచ్చే వాళ్లను నేను అభిమానిస్తాను. విజయ్ ఎదుగుదలను నేను నా విజయంగా భావిస్తుంటాను. అతనికి పేరొస్తే సంతోషించే వాళ్లలో నేనూ ఒకడిని. అంతను ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడని నాకెంతో నమ్మకముంది. విజయ్‌కు మంచి మనసు, తెలివితేటలు ఉన్నాయి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటాడు. ఇంటెలిజెంట్‌గా ఉండేవాళ్లు అందరితో సరదాగా ఉండలేరు. కానీ విజయ్ ఇంటెలిజెంట్ అయినా స్నేహంగా, అందరితో కలిసిపోతాడు. అతనిలా ఇంత తక్కువ టైమ్‌లో స్టార్ అయిన నటుడిని నేను చూడలేదు. విజయ్ తన సినిమాల ఫలితం ఎలా ఉన్నా, విభిన్నమైన సినిమాలే చేస్తాడు. విజయ్ పంపే రౌడీ క్లోత్స్ అంటే నాకు చాలా ఇష్టం.

Advertisement

కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని విజయ్ సొంత ప్రొడక్షన్ పెట్టడం నిజంగా గొప్ప విషయం. ఎంతోమంది టాలెంట్ పీపుల్‌కు అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకా ఇలాగే ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్ పైకొస్తుంటే మీకు అసూయగా ఉందా.. అని అప్పట్లో నన్ను ఒకరు అడిగారు. నేను అన్నాను ఎందుకు అసూయ, మనకంటే ఒకరు ముందు పరిగెడితే అతన్ని చూసి స్ఫూర్తిపొందాలి గానీ అసూయ పడకూడదు అని చెప్పా. విజయ్‌ని రీచ్ కాలేదంటే.. అది అతని తప్పు కాదు.. నా తప్పు అవుతుంది. నేను అతనితో పాటు పరిగెత్తలేకపోతున్నానని భావిస్తాను. అతని నుండి స్పూర్తిపొంది నేనూ పరిగెత్తేందుకు ప్రయత్నిస్తాను.. తప్ప అతనిపై అసూయ పెంచుకోను. ఇలా కష్టపడి ఎదిగేవాళ్లు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటాను..’’ అని అన్నారు.

Advertisement

ఓవరాల్‌గా బన్నీ మాట్లాడింది చూస్తూ.. ప్రస్తుతం అతని నడవడికను బట్టి ఈ మాటలు ఆయన మనసులో నుండి వచ్చినవిగా భావించాలి. ఇంకా చెప్పాలంటే విజయ్‌కి స్టార్‌డమ్‌తో పాటు మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా ‘గీతగోవిందం’. ఈ సినిమాకు విజయ్‌ని సెలక్ట్ చేసింది కూడా అల్లు అర్జునే. ఈ విషయం అభిమానులు మరిచిపోకూడదు. ఇకనైనా ఈ ఫ్యాన్ వార్‌ని పక్కనెట్టి వారిద్దరూ ఎలా ఉన్నారో గమనించండి. వారిద్దరికి ఒకరిపై ఒకరికి ఎటువంటి అభిప్రాయం ఉందో ఆలోచించండి.. అంటూ విమర్శకులు కొందరు సోషల్ మీడియా వేదికగా ఇరు హీరోల అభిమానులకు సూచిస్తున్నారు.

Advertisement

Read Also : Kajal-Allu Arjun : కాజల్, అల్లు అర్జున్ పెళ్లి జరగకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా..?

Advertisement
Advertisement