...

Big Boss Non Stop Winner: బిగ్ బాస్ విన్నర్ గా బిందుమాధవి.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా?

Big Boss Non Stop Winner: బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతటి ఆదరణ ఉందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. 17 మంది కంటెస్టెంట్ లతో 12 వారాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ఈ వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, అనిల్, బాబా భాస్కర్, అరియనా, బిందు మాధవి, మిత్రశర్మ, శివ ఉన్నారు.ఇకపోతే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో మామూలుగా ఐదు మంది మాత్రమే కంటెస్టెంట్ లో ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు.

ఇక ఈ కార్యక్రమం చివరి వారం కావడంతో ఇప్పటికే ఓటింగ్ సెషన్ కూడా క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టైటిల్ రేసులో బిందు మాధవి, అఖిల్ ఉన్నట్లు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఎవరు టైటిల్ గెలుస్తారని పెద్ద ఎత్తున చర్చలు మొదలు పెట్టారు. ఇకపోతే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కావడంతో బిగ్ బాస్ టైటిల్ ను బిందుమాధవి అందుకుందని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా # Bindu The Sensation,# Bindu Madhavi అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో విన్నర్ గా నిలబడాలంటే కేవలం ఫిజికల్ టాస్క్ మాత్రమే కాకుండా వ్యక్తిత్వం కూడా ఎంతో ముఖ్యమైనదని గతంలో అభిజిత్ ప్రస్తుతం బిందుమాధవి నిరూపించారు. మొదటినుంచి టైటిల్ రేసులో బిందుమాధవి అఖిల్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది.అయితే అనుకున్న విధంగానే బిందుమాధవి ఈసారి టైటిల్ గెలిచి బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఇలా అమ్మాయి టైటిల్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిందుమాధవి విన్నర్ కాగా, అఖిల్ రన్నర్ గా నిలిచారు. ఏ విషయం గురించి ఎంత వరకు నిజముందో తెలియాలంటే నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.