Diabetes : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి సమస్యలలో డయాబెటిస్ సమస్య ప్రధానమైనదిగా భావించవచ్చు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు నూటికి 80 శాతం మంది ఈ డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించ లేకపోయినప్పటికీ మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం వల్ల ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు.
డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయటానికి ప్రకృతిలో లభించే కొన్ని రకాల మొక్కలు, వాటి పువ్వులు ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో తంగేడు పువ్వులు కూడా ఒకటి . తంగేడు పువ్వులు డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయటంలో ఉపయోగపడతాయని చాలా మందికి అవగాహన ఉండదు. ప్రకృతిలో విరివిగా లభించే ఈ తంగేడు పువ్వులు వల్ల డయాబెటిస్ వ్యాధి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుండి కూడా విముక్తి పొందవచ్చు. ఈ తంగేడు పువ్వులు డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి మంచి ఔషధంలా పనిచేస్తాయి.
తంగేడు పువ్వులను సేకరించి వాటిని నీడలో ఆరబెట్టి పొడి చేసి నిల్వచేసుకోవాలి. ఈ పొడిని మనం తయారు చేసుకునే పప్పు, రసం, సాంబార్ వంటి కూరలలో వేసుకొని తినటం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.అంతే కాకుండా ప్రతిరోజు ఒక గ్లాస్ పాలలో కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక మగవారిలో వచ్చే స్వప్న స్కలన సమస్యను నివారించటంలో కూడ తంగేడు పువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఒక గ్లాస్ పాలలో తంగేడు పువ్వులు, కొంచెం చక్కెర వేసి బాగా మరిగించి వాటిని వడపోసి ప్రతి రోజూ తాగటం వల్ల పురుషులలో నిద్ర స్కలన సమస్య నియంత్రించవచ్చు.
Read Also : Virigi Chettu : ఈ విరిగి చెట్టు ఔషధాల గని.. ఎలాంటి రోగాలైనా తరిమికొట్టేస్తుంది.. కనిపిస్తే వదిలిపెట్టొద్దు..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World