Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ షో ప్రారంభమైంది. నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తూ హౌస్ లోకి పంపించాడు. ఈ షో డిజిటల్ ఫార్మెట్ ద్వారా రాబోతున్నట్లు గా ముందే ప్రకటించారు. అన్నట్లుగానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Bigg Boss OTT Non Stop)లో ఈ షో ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ షో లైవ్ కొనసాగుతోంది. అయితే ఈ షో కు సంబంధించిన ఎడిటింగ్ వర్షన్ కూడా ప్రతి రోజు ఇవ్వబోతున్నట్లు గా యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఇంట్రడక్షన్ కి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. మరోవైపు లైవ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక కంటెస్టెంట్స్ (bigg boss non stop contestants telugu)ల విషయానికి వస్తే పాత వారితో పాటు కొత్త వారు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లోకి నెంబర్ వన్ కంటెస్టెంట్ గా అషు రెడ్డి అడుగు పెట్టింది. ఆమె గత సీజన్లో తన అందంతో పాటు అభినయం తో ఆకట్టుకుంది. ఇక రెండవది కంటెస్టెంట్ గా మహేష్ విట్టా వెళ్ళాడు. మూడవ కంటెస్టెంట్ గా ముమైత్ ఖాన్, నాలుగవ కంటెస్టెంట్ గా కొత్త కుర్రాడు అజయ్ హౌస్ లో అడుగు పెట్టాడు. 5వ కంటెస్టెంట్ గా యాంకర్ స్రవంతి చోక్కరపు, ఆరో కంటెస్టెంట్ గా రేడియో జాకీ అయిన చైతు, ఏడవ కంటెస్టెంట్ గా అరియానా, ఎనిమిదవ కంటెస్టెంట్ గా నట్రాజ్ మాస్టర్ హౌస్ లో అడుగు పెట్టి సందడి మొదలు పెట్టారు.
Bigg Boss OTT Non Stop : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు కంటెస్టెంట్లు వీరే..
ఇక తొమ్మిదవ కంటెస్టెంట్ గా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న శ్రీ రాపాక, పదవ కంటెస్టెంట్ గా మోడల్ అనిల్ రాథోడ్, పదకొండవ కంటెస్టెంట్ గా నటి మిత్ర శర్మ, 12వ కంటెస్టెంట్ గా తేజశ్రీ, పదమూడవ కంటెస్టెంట్ గా సరయు, 14వ కంటెస్టెంట్ గా యూట్యూబ్ యాంకర్ శివ, 15వ కంటెస్టెంట్ గా హీరోయిన్ బింధు మాధవి, 16వ కంటెస్టెంట్ గా హీరోయిన్ హమీదా, 17వ కంటెస్టెంట్ గా మాజీ బిగ్ బాస్ రన్నరప్ అయిన అఖిల్ ఎంట్రీ ఇచ్చారు.
మరో కంటెస్టెంట్ గా రోల్ రైడా కూడా వెళ్లాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఆయన వెళ్లలేదు. వీరి ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారింది. వీరంతా కూడా గొడవలు చేయడం ఖాయం అంటూ బిగ్బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ షో మునుప్పటి ఎపిసోడ్స్ కంటే రచ్చ రచ్చ ఉండటం ఖాయం.
Read Also : Karthika Deepam Feb 26 Episode : ఇంటికొచ్చిన మోనితాపై వంటలక్క ఫైర్.. అసలు నిజం తెలిసి ఏమి చేసిందంటే?