...

RRR Komuram Bheemudo Lyrics : RRR ‘కొమురం భీముడో’ పాట లిరిక్స్.. వింటేనే రోమాలు నిక్క పొడవాల్సిందే!

RRR Komuram Bheemudo Lyrics : ఆర్ఆర్ఆర్.. ఈ పేరు వింటే చాలు… ప్రేక్షకుల రోమాలు నిక్కపొడవాల్సిందే.. అద్భుతమైన ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే ఆర్ఆర్ఆర్.. అదో వైబ్రోషన్.. ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి టీజర్.. ట్రైలర్.. సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మరో పాటను వింటే.. ప్రేక్షకుల రక్తం మరిగిపోవాల్సిందే.. అంత అద్భుతంగా పాట వచ్చింది..

స్వాతంత్య్ర సమర యోధులైన కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలతో మరింత హైప్ క్రియేట్ చేశాడు రాజమౌళి.. RRR నుంచి వచ్చిన ‘కొమురం భీముడో.. పాట వింటే రోమాలు నిక్కబోడుచుకునేలా ఉందని ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పాటంతా కొమురం భీం అభినయాన్ని తెలియజేసేలా ఉంది. సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాయగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. కీరవాణి కుమారుడు కాలభైరవ ఎంతో ప్రాణం పెట్టి ఈ పాటను పాడాడు. ఎన్టీఆర్ అభినయాన్ని తలపిస్తూ కాలభైరవ ఎంతో చక్కగా పాడాడు.. పాటకు మరింత హైప్ తీసుకొచ్చాడు. ఇప్పుడా కొమురం భీముడో పాట లిరిక్స్ ఏంటో ఓసారి చూద్దాం..

‘‘- నిన్ను గన్న నేలతల్లి.. ఊపిరి పోసిన సెట్టు సేమ.. పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. వినపడుతుందా..’’

పల్లవి :

కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో
కొమురం భీముడో .. కొమురం భీముడో..
రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో..

 చరణం : || 1 ||

కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల..
కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో..
జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..
కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

చరణం : || 2 ||

చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..
సిలికే రక్తం సూసి సెదిరేతోగాల..
బుగులేసి కన్నీరు ఒలికితోగాల..
భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో..
కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

చరణం : || 3 ||

కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో.. కొమురం భీముడో..
పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో..

Read Also : Radhe Shyam Theatrical Trailer : రాధే శ్యామ్ ప్రీ-రీలీజ్ ఈవెంట్.. ట్రైలర్ వచ్చేసింది..!