Acharya Flop : ‘ఆచార్య’ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.. ప్లాప్‌‌కు ఆ నాలుగు కారణాలు..!

Updated on: August 4, 2025

Acharya Flop Reasons : అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా అనగానే ఇండస్ట్రీ హిట్ ఖాయమని.. నాన్ రాజమౌళి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ప్రతి ఒక్కరూ బలంగా విశ్వసించారు. కానీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమా అత్యంత దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. 130 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఆచార్య సినిమా కనీసం 30 కోట్లు వసూలు చేస్తుందా అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు.

గత రెండు మూడు వారాలుగా ఆచార్య సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి రామ్ చరణ్ మాట్లాడుతూ అంచనాలు భారీగా పెంచడంతో పాటు ఎక్కడ తగ్గకుండా సినిమా స్థాయిని పెంచడం కోసం ప్రయత్నించారు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ కూడా అద్భుతంగా ఉంటుందని.. ముఖ్యంగా రామ్ చరణ్ మరియు చిరంజీవి ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మరియు డాన్సులు అభిమానులకు కన్నుల పండుగగా ఉంటాయి అంటూ వారు ప్రచారం చేశారు.

Acharya Flop Reasons : chiranjeevi-acharya-movie-postmortem-report
Acharya Flop Reasons : chiranjeevi-acharya-movie-postmortem-report

కానీ సినిమా అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. సినిమా ప్లాప్ కు నాలుగు కారణాలను విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అందులో ప్రధానంగా కథ లేకపోవడం.. దర్శకుడు కొరటాల శివ కథ రాసుకున్నాడా లేదా అనే అనుమానం కలుగుతుంది. చిరంజీవి మరియు చరణ్ ఉన్నారు కదా అని ఏదో ఒకటి కథ అన్నట్లుగా సినిమా ను తెరకెక్కించాడు అన్నట్లుగా ఉంది. ఇక రెండవది సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌ కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులకు కన్నుల వింధు అన్నట్లు గా కాకుండా కామెడీగా ఉన్నాయి.

Advertisement

వీఎఫ్‌ఎక్స్ తో సినిమాలోని సన్నివేశాలను ఆకర్షణీయంగా మారాల్సి ఉంది. కాని సన్నివేశాలను అత్యంత దారుణంగా వీఎఫ్ఎక్స్‌ వల్ల ఉన్నాయంటూ విమర్శల పాలయ్యాయి. ఇక సినిమాకు హీరోయిన్ గా కాజల్ నటించిన పాత్ర ను పూర్తిగా తొలగించడం జరిగింది. సుదీర్ఘ కాలం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కాజల్ కొనసాగుతోంది. అలాంటి కాజల్‌ ఆచార్య సినిమాలో నటిస్తుంది అనగానే ఆమె అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ సినిమాలో ఆమె లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక చివరగా ఈ సినిమాలో చూపించిన కొన్ని పాత్రలను చాలా వీక్ గా చూపించారు. ఉదాహరణకు సోనూ సూద్‌ సీనియర్ నటుడు, గొప్ప వ్యక్తి. అలాంటి సోనూ సూద్‌ ను ఒక సాధారణ విలన్గా చూపించడంతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా ఫన్నీగా చేయడం సినిమా యొక్క ఫ్లాప్ కి కారణం అంటూ సీనియర్ సినీ పండితులు ఆచార్య పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇస్తున్నారు.

Read Also : Acharya Review : ‘ఆచార్య’ రివ్యూ : ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ, కానీ…!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel