Intinti Gruhalakshmi serial September 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవుడు ముందు కూర్చొని జరిగిన విషయాల గురించి దేవుడికి థాంక్స్ చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో నందు, లాస్య ఇద్దరు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ సామ్రాట్ గారికి ఈ విషయం ఎలా తెలిసి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య మనం ఈ విషయం గురించి కన్విన్స్ చేయాలని చెప్పినా ఆయన నమ్మరు అని అనగా ఆ విషయం కాదు మన ఉద్యోగం సంగతి ఏంటి అని నందు భయపడుతూ ఉంటాడు. కానీ లాస్య మాత్రం మనకు ఈ ఉద్యోగం చాలా అవసరం కావాలని నేను వెళ్లి బ్రతిమిలాడతాను అని అంటుంది.
మరొకవైపు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు తులసి కోసం ఎదురుచూస్తూ ఉండగా తులసి వచ్చి బయట కూర్చుని ఉండడంతో సామ్రాట్ వెళ్లి పలకరిస్తాడు. అలా వారిద్దరూ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి భయం భయంగా లాస్య వస్తుంది. సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అనగా ఫోన్ చేసి రావాల్సింది అని సామ్రాట్ చిరాకుగా అనడంతో, సారీ సార్ మీ అపార్ట్మెంట్ తీసుకోకుండా లోపలికి వచ్చినందుకు కానీ నేను మీతో ఒక 10 మినిట్స్ మాట్లాడాలి అని అనడంతో లాస్య ని వెళ్లి క్యాబిన్లో కూర్చోమని చెబుతాడు సామ్రాట్.
ఆ తర్వాత సామ్రాట్, తులసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ తులసి తో మాట్లాడుతూ వాళ్ళ గుట్టు బయటపడి పోయింది నేను ఉద్యోగాలు తీసేస్తాను అని పసిగట్టి వాళ్ళు నా దగ్గరికి మాట్లాడడానికి వచ్చారు ఈ విషయం పట్ల నిర్ణయం మీ చేతిలోనే ఉంది తులసి గారు అని అంటుంది. ఓకే అంటే ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే ఉద్యోగాలు తీసేస్తాను అని అంటాడు.
అప్పుడు తులసి మళ్లీ లాస్య వాళ్ళని గుడ్డిగా నమ్ముతూ వారిని జాబ్ లోంచి తీసేయొద్దు అని చెబుతుంది. ఆ తర్వాత సామ్రాట్ లాస్య దగ్గరికి వెళ్తాడు. స్వాతి ఆడదానిగా నువ్వు తులసికి అన్యాయం చేశావు కదా అని అనడంతో లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది. నందు తులసి మాజీ భర్త అన్న విషయం మీకు చెప్తే మాకు ఉద్యోగాలు పోతాయి అని మేము చెప్పలేదు అని చెబుతుంది లాస్య.
Intinti Gruhalakshmi serial Sep 15 Today Episode : తులసికి చెయ్యి అందించిన సామ్రాట్..
అప్పుడు సామ్రాట్ మీ వల్ల తులసి గారికి ఎటువంటి లోటు రాకూడదు ఇంకెప్పుడైనా ఇలా జరిగితే మీ కెరీర్ నాశనం చేస్తాను అంటూ స్వీట్ గా లాస్యకు వార్నింగ్ ఇస్తాడు సామ్రాట్. అప్పుడు లాస్య ఇంకెప్పుడు ఇలా జరగదు సార్ మాకు చివరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తులసి దగ్గరికి వెళ్లిన లాస్య మారిన దానిలా నటిస్తూ తులసికి థాంక్స్ చెబుతుంది. అప్పుడు తులసి నా జోలికి ఇంకెప్పుడు రావద్దు అని నందగోపాల్ గారికి చెప్పండి అని అనడంతో సరే అని అంటుంది లాస్య.
ఇక రేపటి ఎపిసోడ్ లో నందు సామ్రాట్ ఇద్దరూ కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతంలో నిలబడి ఉంటారు. అప్పుడు సామ్రాట్ నువ్వు నిజంగా దురదృష్టవంతుడివి నందు దేవుడిచ్చిన గొప్ప వరం లాంటి తులసి గారిని ఎందుకు వదులుకున్నావు అని అనడంతో నందు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతంలో తులసి నవ్వుతూ అక్కడ ఉన్న వారిని మాట్లాడిస్తూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ తులసిని చూస్తూ గొప్పగా పొగడడంతో నందు అది చూసి తట్టుకోలేక పోతాడు.