Intinti Gruhalakshmi july 14 Today Episode : తులసికి సరికొత్త సమస్య.. జైల్లో అనసూయ,పరంధామయ్య..?

Updated on: July 14, 2022

Intinti Gruhalakshmi july 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హనీ అనే ఒక పాప సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో అని అనే పాప ఆడుకుంటూ సెక్యూరిటీ గార్డు కనిపించకుండా సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుపైకి వెళ్ళిపోతుంది. దాంతో ఆ ఇంట్లో పనివాళ్ళు సార్కి తెలిస్తే ప్రాణం తీస్తారు అని ఆ పాపను వెతకడానికి బయలుదేరుతారు. మరొకవైపు నందు లాస్య కారులో మాట్లాడుకుంటూ వస్తూ చిన్న పాపను కారుతో ఢీ కొడతారు.

Advertisement

ఇంతలోనే తులసి అటుగా వెళుతూ ఆ పాపని చూసి భయపడి హాస్పిటల్ కి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత లాస్య వాళ్లు కూడా ఆ పాపకి ఏమవుతుందో అన్న భయంతో తులసి వెళ్లిన హాస్పిటల్ కి వెళ్తారు. ఇంతలోనే డాక్టర్ వచ్చి ఆ పాప మీకు ఏమవుతుంది అని తులసిని అడగగా అమ్మని అవుతాను అని చెబుతుంది తులసి.

Intinti Gruhalakshmi july 14 Today Episode : సామ్రాట్ ఆవేదన కూతురు కిడ్నాప్‌..హనీకి తల్లిగా తులసి…..

ఆ తరువాత పాపకీ ట్రీట్మెంట్ చేస్తుండగా నందుని లాస్య అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళుతుంది. మరొకవైపు ఇంట్లో పని వాళ్ళు పాప కోసం వెతుకుతూ పాపని కిడ్నాప్ చేశారు అని అనుకుంటారు. ఆ నందు, లాస్యలు ఒక చోటుకి వెళ్తారు. ఇంతలోనే అతనికి పాప కనిపించడం లేదు అని చెప్పడంతో అతను ఇంట్లో పనివాళ్ళను కొట్టి అరుస్తూ ఉంటారు.

పాప కనిపించక పోయే సరికి అందరి మీద అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత నందు లాస్య వాళ్ళు మళ్లీ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ డాక్టర్ చెప్పిన మాటలు విని సంతోషంగా ఫీల్ అవుతారు. మరొకవైపు కూతురు కనిపించడం లేదు అని అతను పోలీసులను పిలిపించి వెతకమని చెబుతాడు. పాపను వెతికి పట్టుకున్న వారికి కోటి రూపాయలు ఇస్తాను అని చెబుతాడు.

Advertisement

మరొకవైపు తులసి ఆ పాపతో ప్రేమగా మాట్లాడగా ఆ పాప తులసికి అబద్ధాలు చెప్పి ఊరంతా తిరగాలి అని అనుకుంటుంది. ఇంతలోనే తులసి వాళ్ళు ఆటో లో వెళ్తూఉంటారు. ఇంతలోనే హనీ వాళ్ళ నాన్న వాళ్ళు పాప కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తరువాత తులసి వాళ్ళు ఆ పాప పడిన ప్లేస్ కి వెళ్లి ఈ చుట్టుపక్కల మీ ఇల్లు ఉంటుంది బాగా ఆలోచించి చెప్పు అని అంటుంది.

ఆ పాప కావాలని తులసిని ఆటపట్టించడం కోసం తులసికీ మాకు మా ఇళ్ళు తెలియదు అని చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో అనసూయ వాళ్ళు జైల్లో ఉండగా హనీ వాళ్ళ నాన్న తుపాకి తీసుకొని తులసికీ గురి పెడతాడు. నా కూతుర్ని కిడ్నాప్ చేయడానికి నీకు ఎంత ధైర్యం షూట్ చేసి పారేస్తా అని గట్టిగా అరుస్తాడు.

Read Also : Intinti Gruhalakshmi July 13 Today Episode : అమ్మవారికి బోనం సమర్పించిన తులసి.. కోపంతో రగిలిపోతున్న లాస్య..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel