Intinti Gruhalakshmi July 13 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అమ్మవారికి బోనం సమర్పించే అవకాశం తులసీకే దక్కడంతో ఆనందపడుతూ ఉంటుంది తులసి. ఈరోజు ఎపిసోడ్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిన కళ్ళును తులసి తాగేస్తుంది. అది చూసి లాస్య వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత తులసి లాస్య వాళ్ళు బోనాలు ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడు భాగ్య తులసి తో నువ్వు ఇచ్చిన మందు పని చేయడం లేదేమో అని అనగా పక్కనే ఉన్న వసు వారి మాటలు వింటూ ఉంటుంది.
అదే సమయంలో తులసికి నిద్ర వచ్చినట్టుగా అనిపించడంతో వెంటనే వసుధార పసుపు నీళ్లు తీసుకువచ్చి చల్లుతూ ఉంటుంది. అలా మొత్తానికి కష్టం మీద అమ్మవారికి బోనం సమర్పిస్తుంది తులసి. అప్పుడు అమ్మవారికి సమర్పించాల్సిన లాస్య బోనం కింద పడిపోతూ ఉండగా వెంటనే తులసి పట్టుకుంటుంది. ఆ తర్వాత అమ్మవారు వచ్చిన ఒక మహిళ తులసిని చూసి నీకు మంచి రోజులు వస్తాయి. త్వరలోనే నీ జీవితం లోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు అని చెబుతుంది. అయితే లాస్య తన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయినందుకు కోపంతో చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య భాగ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార వస్తుంది. ఇదంతా మీరే చేశారని నాకు తెలుసు అంటూ వాళ్ళిద్దరికీ గట్టిగా కౌంటర్ ఇస్తుంది వసుధార.
Intinti Gruhalakshmi July 13 Today Episode : ఇంటింటి గృహలక్ష్మి.. గన్‌తో గురి పెట్టిన వ్యక్తి ఎవరంటే..?
మరొకవైపు తులసి వసుధార కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి నా కోసమే ఎదురు చూస్తున్నారా ఆంటీ అంటూ నవ్వుతూ పలకరిస్తుంది. తనకు పసుపు నీళ్లు చెల్లినందుకు తులసి వసుధారకి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆ తర్వాత నువ్వు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అంటూ వసుధారని దీవిస్తుంది తులసి. మరొకవైపు ప్రేమ్ కు మ్యూజిక్ ఏర్పాట్లు చేసుకోమని శృతి చెప్పగా, కానీ ప్రేమ్ మాత్రం ఆ డబ్బుతో తన కంటే తన తల్లికి ఎక్కువగా అవసరం ఉంది అని అంటాడు. అమ్మ మ్యూజిక్ స్కూల్ పెట్టాలి అనుకుంటోంది అందుకే ఈ డబ్బులు అమ్మకు ఇస్తాను అని అంటాడు ప్రేమ్.
మరొకవైపు పరంధామయ్య దంపతులు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దివ్య అక్కడికి వచ్చి వారిపై సరదాగా కౌంటర్లు వేయడంతో ఆ మాటలు విని తులసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంకిత అక్కడికి వచ్చి తాము క్లినిక్ పెట్టాలి అన్న ఆలోచనలు ఉన్నాము అన్న విషయాన్ని చెప్పడంతో తులసి సంతోషంగా సరే అని అంటుంది. అప్పుడు అనసూయ తులసికి ఒక మ్యూజిక్ స్కూల్ గురించి ప్లాన్ చెప్పడంతో వెంటనే తులసి ఆ ప్లాన్ సక్సెస్ చేసుకోవడానికి ఒక ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి బయలుదేరుతుంది. రేపటి ఎపిసోడ్ లో అనసూయ దంపతులు జైల్లో ఉంటారు. వారిని ఒక అతను గన్ తో గురి పెట్టి భయపెడుతూ ఉంటాడు. నా పిల్లల్ని ఎక్కడ దాచావు అని బెదిరిస్తూ ఉంటాడు.
Read Also : Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..?