Punith Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయనకు సీరియస్‌గా గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందనేలా వార్తలు వచ్చినా, డాక్టర్స్ ఎంతగా ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. సాయంత్రం 3గంటలకు విక్రమ్ హాస్పిటల్ అధికారికంగా ఆయన మరణవార్తకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనుంది.
పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పాలంటే.. ఆయన మంచి నటుడే కాదు గాయకుడు కూడా. అలాగే కొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. ఇటీవల ఆయన నటించిన ‘యువరత్న’ చిత్రం తెలుగులోనూ విడుదలై మంచి విజయం సాధించింది. హీరోగా ఆయన ఇప్పటి వరకు 29 సినిమాలు చేశారు. ప్రస్తుతం ‘జేమ్స్’, ‘ద్విత్వ’ అనే సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అందరూ ఆయనని అప్పూ అని ప్రేమగా పిలుస్తారు. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world