Horoscope : ఈవారం అనగా జులై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఒక రెండు రాశుల వాళ్లకి ఈ వారం అంతా చాలా బాగుందని వివరించారు. అయితే ఆ రాశులు ఏంటి, వారికి కలిసి వచ్చే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. ఈ రాశి వాళ్లకు ఈవారం అద్భుతమైన కాలం. అన్ని విధాలా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, స్థిరమైన జీవితం లభిస్తాయి. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. ధనయోగం సూచితం. గృహ, వాహన, వస్తు యోగాలతో పాటు భూయోగం కూడా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార బలం ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మిథున రాశి.. ఈ రాశి వాళ్లకు మంచి ఆలోచనా శక్తి ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార విజయం సంపూర్ణం. ఉద్యోగంలో చిక్కులు తొలగుతాయి. ఒత్తిడి లేకుండా పని చేయండి. అనుకోని లాభం ఒకటి ఉంది. ధైర్యంగా ముందడుగు వేయండి. కొందరు ఇబ్బంది కల్గించినా కార్యసిద్ధి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. దుర్గా దేవిని స్మరించండి. మేలు జరుగుతుంది.
Read Also : Peacock Feathers: ఇంట్లో నెమలి ఈక ను ఏ దిశలో పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.