Samantha: సమంతకు ఎవరూ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు.. ‘యశోద’ డెైరెక్టర్స్ కామెంట్స్

Samantha: అటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది సమంత. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యతో విడాకులు అయిన తర్వాత ఈ భామ తన జోరును మరింతగా పెంచేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2.0 తర్వాత తన దూకుడును కొనసాగిస్తుంది. తన కెరీర్ పైన స్పష్టమైన అవగాహన ఉండటంతో పాటు మంచి మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది సమంత. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజింగ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత… బాలీవుడ్ పై తన ఫోకస్ ను పెట్టింది. ఇప్పుడు వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ పోతోంది. సమంత నటించి లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం పాన్ ఇండియా వైడ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలో సమంత మరో ప్యాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పింది. వెరీ డిఫరెంట్ జోనర్ లో వస్తున్న ఆ చిత్రానికి ఇద్దరు దర్శకులు డైరెక్షన్ చేస్తున్నారు. అది కూడా ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. ‘యశోద’ టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తుంది.

Advertisement

ఈ సినిమాను సమంతకు నెరేట్ చేస్తున్న సమయంలోనే నిమిషాల వ్యవధిలోనే ఆమె ఓకే చెప్పిందట. ఇందులోని యాక్షన్ సన్నివేశాల్లో సమంత ఎవరి సాయం అవసరం లేకుండానే ఫైట్ సీక్వెన్స్ లు చేసిందని.. తనకు ఎవరి సాయం అవసరం లేదని దర్శకుడు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel