Pooja hegde: సినిమా ప్లాప్ అయితే ఖర్చులు నీవే.. పూజా హెగ్డేకు నిర్మాత షాక్!

Pooja hegde: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే కూడా చేరిపోయింది. అయితే ఈమె నటించిన సినిమాల్లో కొన్ని హిట్లు, ప్లాపులు ఉన్నప్పటికీ.. ఆమె జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ… ఇటు తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో దూసుకెళ్తోంది. అలాంటి ఈ టాప్ హీరోయిన్ కు ఈ ఏడాది ఎంత మాత్రమూ కలిసి రాలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆమె నటించిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీనికి తోడు తాజాగా ఓ సినిమా నిర్మాతలు ఆమెకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఖర్చులకు సంబంధించిన బిల్లులు కట్టుకోవాలంటూ అమెకే వెనక్కి పంపారట.

మామూలుగా పూజా హెగ్డే షూటింగ్ సమయంలో దాదాపు పదీ, పన్నెండు మందిని తన వెంట తీసుకెళ్తుందట. అయితే తన స్టాఫ్ ఖర్చులన్నీ కూడా నిర్మాణ సంస్ధే భరించాలని కండిషన్ కూడా పెడ్తుందట ఈ విషయంపై తమిళ డైరెక్టర్ ఆర్కే సెల్వమణి కూడా ఆగ్రహం వ్యక్తం చేశఆరు. అయితే తాజాగా బీస్ట్ సినిమా ప్రొడ్యూసర్లు ఆమెకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పూజ స్టాఫ్ కు అయ్యే ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఆమె ఇంటికి పంపారు. అంతేకాదు వాటిని నువ్వే చెల్లించుకో అని షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రధానం కారణం సినిమా ప్లాప్ అవ్వడమే. ఆ ఖర్చులనే తట్టుకోలేకపోతున్న ప్రొడ్యూసర్లకు పూజా హెగ్డే స్టాఫ్ ఖర్చులు మరింత ఎక్కువ అనిపించి అలా చేశారట.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel