Khushbu : సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ ఎంతో బొద్దుగా ఉంటేనే చూడటానికి చాలా ముద్దుగా ఉంటారు. ఇలా ముద్దుగా ఉన్నప్పుడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్స్ ప్రస్తుతం జీరో సైజ్ మోజులో పడి వర్కౌట్స్ చేస్తూ సన్నజాజి తీగల మారిపోయి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోని సీనియర్ నటి ఖుష్బూ చూడటానికి ఎంతో బొద్దుగా అందంగా ఉంటారు. ఇలా తన అందంతో తెలుగు తమిళ భాషలలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి కుష్బూ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోలకు తల్లి పాత్రలో నటిస్తూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఖుష్బూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన శరీర ఫిట్నెస్ పై కూడా పూర్తి దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈమె భారీ వర్కౌట్స్ చేస్తూ గుర్తుపట్టలేని విధంగా చాలా నాజూగ్గా మారిపోయారు.
ప్రస్తుతం ఖుష్బూ బక్కచిక్కిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈ ఫోటోలను చూసి ఆశ్చర్యపోతున్నారు.ఎంతో ముద్దుగా ఉన్నటువంటి కుష్బూ ఏంటి ఇలా మారిపోయారు.. ఈమె బొద్దుగా ఉన్నప్పుడే అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు సన్నజాజి తీగలా నాజూగ్గా ఎంతో అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా కుష్బూను ఇలా చూడలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.
Tufan9 Telugu News And Updates Breaking News All over World