Youngest organ donor: ఆడిపాడే వయసులోనే అవయవ దానం.. ఇదే మొదటి సారట!

Youngest organ donor: ఆ పాప వయసు ఆరేళ్లు… కానీ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జిరిగింది. నోయిడాలోని ఆరేళ్ల బాలిక రోలి ప్రజా ప్రతిపై గుర్తు తెలియని దుండగలు కాల్పులు జరిపారు. కాల్పు ఈ దుర్ఘటనలో బాలిక రోలి ప్రజా ప్రతి తీవ్రంగా గాయపడింది. ఆ బాలికను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆ బాలిక రోలీ ప్రజా ప్రతి కోమాలోకి వెళ్లింది. ఆ పాపను కాపాడేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నించారు. బుల్లెట్ తలలోకి దూసుకుపోవడంతో… తలలో రక్తం గడ్డ కట్టింది. దీంతో వైద్యులు పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు వైద్యులు. ఇదే విషయాన్ని డాక్టర్లు బాలిక తల్లి దండ్రులకు చెప్పారు. తలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మెదడు పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.

Advertisement

పాప బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని చెప్పడంతో పాటు పాప యొక్క అవయవాలు దానం చేయాలని ఆ తల్లిదండ్రులకు అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. వైద్యులు అవయవదానం గురించి చెప్పిన విధానం నచ్చడంతో అవయవాలు దానం చేసేందుకు బాలిక తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. దీంతో వైద్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాలేయం, మూత్ర పిండాలు, కార్నియాలు, గుండె కవాటం తీసుకోవాలని వైద్యులు నిర్ణయించారు.

వీటిని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు రోగులకు శస్త్రచికిత్స ద్వారా వారి ప్రాణాలు కాపాడారు. ఈ అవయవ దానంతో రోలీ ప్రజా ప్రతి ఢిల్లీలోని ఎయిమ్స్ హిస్టరీలోనే అతి చిన్న వయస్కురాలైన దాతగా నిలిచింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel