Samantha: సమంతకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభినయంతో చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తూ.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాదు హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని.. అక్కినేని కుటుంబానికి కోడలిగా మారింది. కానీ అనుకోని కారణాల వల్ల చైతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది.

ఇదిలా ఉండగా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆస్తిపై చాలానే వార్తలు వస్తుంటాయి. అయితే సమంతకు దాదాపు 80 కోట్ల వరకూ ఆస్తి ఉందని టాలీవుడ్ సమాచారం. ఆమె ఒక్కో సినిమాకు గాను 2 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అంతే కాకుండా పలు షాపింగ్ మాల్ ఓఫెనింగ్స్.. యాడ్స్.. వెబ్ సిరీస్… సినిమాలు.. ఇలా వచ్చిన అవకాశాలన్నింటినీ వాడుకుంటూ తన అందం, అభినయంతో సత్తా చాటుతోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel