Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి ఇంటికి వచ్చిన శశికళ అప్పు తీరుస్తావా లేదంటే ఇల్లు అమ్ముతావా అని రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.
శశికళ తులసి ఇంటికి వచ్చి ఏదో ఒక మాట చెప్పు తులసీ నా సహనాన్ని పరీక్షించకూడా అని గట్టిగా అరవడంతో అప్పుడు తులసి భాగ్య అని పిలిచి నీ సమాధానం చెప్పు భాగ్య. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా అని అంటుంది. అప్పుడు భాగ్య తులసి చెప్పిన డీల్ గురించి, లాస్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక తులసి టైం లేదు చెప్పు అని అనడంతో భాగ్య తులసి మాటకి కట్టుబడి ఉంటాను నువ్వు చెప్పినట్టు వింటాను అని డీల్ కి ఒప్పుకుంటుంది భాగ్య. అప్పుడు తులసి ఎవరికీ ఇష్టం లేని నిర్ణయం తీసుకుంటున్నాను నన్ను క్షమించండి అని అత్తమామలకు క్షమాపణలు చెప్పి శశికళ తో ఇకపై ఇల్లు మీదే అని చెప్పి శశికళకు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను అందిస్తుంది. అప్పుడు శశికళ తులసి కి ఇస్తాను అన్న 20 లక్షలు తులసి చేతిలో పెడుతుంది.
ఇక వెంటనే తులసి శశికళ ఇచ్చిన 20 లక్షలు భాగ్య చేతిలో పెడుతుంది. అప్పుడు భాగ్య ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. డబ్బు చేత పడగానే మా వారు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది భాగ్య. ఇక శశికళ కు ఇంటిని ఇచ్చేయడంతో తులసి కుమిలిపోతూ ఉంటుంది.
తులసి బాధను చూసిన శశికళ ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి అంటే ఇష్టమే కాబట్టి కొద్దిరోజులు మీరు ఇక్కడే ఉండొచ్చు అని అనడంతో తులసి మాత్రం ఎమోషనల్ డైలాగులు చెబుతూ మీ ఇంటి తో మాకు సంబంధం తెగిపోయింది రుణం తీరిపోయింది మేము రేపే ఇంట్లో నుంచి వెళ్లి పోతున్నాము అని చెబుతుంది. మరొకవైపు భాగ్య ఆటోలో వెళుతూ డబ్బులు చూసుకుని మురిసి పోతూ ఉంటుంది.
తులసి అక్క మంచిది అని తెలుసు కానీ మరీ ఇంత మంచిది అనుకోలేదు అని అనుకుంటూ ఉండగా ఇంట్లో లాస్య ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి జరిగినదంతా వివరిస్తుంది. అప్పుడు లాస్య, భాగ్య పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది. కానీ భాగ్య పని అయిపోయింది. నాకు అత్యాశ లేదు వచ్చిన దాన్ని సరి పెట్టుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
మరొకవైపు లాస్య, భాగ్య మాటలకు మండిపడుతూ తులసి ప్లాన్ ప్రకారమే ఇల్లు అమ్మేసిందని, బ్యాంకులో లోన్ తీసుకుంటాను అని అబద్ధం చెప్పి అందరినీ మోసం చేసింది అని నందు కి అబద్ధాలు చెప్పి నోరూరిపోస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World