Intinti Gruhalakshmi: సామ్రాట్ పై మండిపడ్డ తులసి.. నందు కి అబద్దం చెప్పిన లాస్య..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అనసూయ జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్లో ఆస్తి పేపర్లు తన చేతికి రావడంతో లాస్య ఆనంద పడుతూ ఉంటుంది. నా పనులు అన్ని ఇంత త్వరగా పూర్తయితావు అని అనుకోలేదు లాస్య నీకు అదృష్టం పట్టింది శభాష్ అని తనని తానే పొగుడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎలా అయినా ఈ పేపర్లు నందు పడకుండా దాచి పెట్టాలి అని దాచి పెడుతూ ఉండగా ఇంతలోనే నందు అక్కడికి వచ్చి అది చూస్తాడు.

Advertisement

అప్పుడు లాస్య ఒకసారిగా షాక్ అవుతుంది. అప్పుడు అవి ఏం పేపర్లు లాస్య అనగా నా రెజ్యూమ్ నందు అంటూ అబద్ధం చెబుతుంది. ఆ తర్వాత ఆనందు అమ్మానాన్న గురించి తలుచుకుంటే బాధ అవుతుంది ఏదో ఒకటి చేసి మార్చాలి. నా ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ల మధ్య ఇంత దూరం ఎప్పుడూ చూడలేదు అని బాధపడుతూ ఉంటాడు నందు. అప్పుడు లాస్య అవన్నీ నీకెందుకు నందు నాకు వదిలెయ్ నేను చూసుకుంటాను కదా అని అంటుంది.

Advertisement

మరొకవైపు ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శృతి కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి అలా ఉన్నావ్ శృతి అనడంతో ఏం చెప్పాలి ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి కనిపించడం లేదు ఏ పని చేయబుద్ధి కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సమాజం గురించి మాట్లాడుకుంటూ కోపడుతూ ఉంటారు శృతి ప్రేమ్. అప్పుడు శృతి ఆంటీ ఎలా ఉంది ప్రేమ్ అని అడగగా నవ్వాలో ఏడవాలో తెలియక బాధపడుతోంది అని అంటాడు.

మరొకవైపు తులసి కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉండగా అక్కడ అందరూ సింగిల్ అని చెప్పి తులసిని అవమానించి అద్దెకు ఇవ్వరు. అప్పుడు తులసిని ఒక ఆమె సింగిల్ గా ఉన్నవారు ఎలాంటి పనులు చేస్తారో మాకు తెలియదా అంటూ నోటికి వచ్చిన విధంగా వాడడంతో తులసి ఆమె తగిన విధంగా బుద్ధి చెబుతుంది. తులసి అలసిపోయి ఒక చెట్టు దగ్గర నిలబడగా ఇంతలో సామ్రాట్ ఫోన్ చేస్తాడు.

Advertisement

అప్పుడు తులసి సామ్రాట్ తో కోపంగా మాట్లాడగా ఏమైంది తులసి గారు ఎందుకు అలా ఉన్నారు మీరు సింగల్ గా ఉన్నారా అనడంతో వెంటనే సామ్రాట్ మీద సీరియస్ అవుతుంది తులసి. సింగల్ గా ఉంటే మీ ఆఫీసుకు రానివ్వరా కావాలంటే తీసేయండి జాబ్ మానేస్తాను అని అనగానే నేనేమన్నాను తులసి గారు ఏం జరిగింది చెప్పండి అనడంతో తులసి జరిగిన విషయం మొత్తం సామ్రాట్ కి వివరిస్తుంది.

అప్పుడు సామ్రాట్ తులసికి పంచులు తులసిని నవ్విస్తాడు. మరొకవైపు అందరూ భోజనానికి కూర్చోగా లాస్య అసలు విషయం చెప్పమంటూ అనసూయకు సేవలు చేస్తుంది. అప్పుడు అత్తయ్య గారు ఏదో చెప్పాలి అనుకున్నారు కదా చెప్పండి వెంటనే అంకిత భోజనం చేసినప్పుడు అవసరం లేదు తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది. అనసూయ అసలు విషయం చెప్పబోతూ ఉండగా దివ్య అడ్డుపడుతుంది. ఇప్పుడు దివ్య మీద సీరియస్ అవుతుంది లాస్య.అప్పుడుశృతి ఇంట్లో ఎవరు పుల్లలు పెట్టి ఉద్దేశంతో మాట్లాడతారు అందరికీ తెలుసు అనడంతో నందు లాస్య శృతి వైపు కోపంగా చూస్తారు.

Advertisement