Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి కుటుంబ సభ్యులు అందరి కలసి భోజనం చేస్తూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో శృతి కావాలని గొడవలు తెచ్చే ఉద్దేశం ఎవరికీ లేదు అనటంతో అందరి లాస్య వైపు చూస్తారు. ఆ తర్వాత అనసూయ అసలు విషయాన్నీ చెబుతుంది. మీ తాతయ్య పుట్టినరోజు వేడుకలు ఇంట్లో ఘనంగా చేసుకుందాము జరిగిన విషయాలన్నీ మర్చిపోదాం అని అంటుంది. అప్పుడు అనసూయ సామ్రాట్ తులసి పేర్లు ఇంట్లో వినిపించకూడదు ఉండటంతో ఇంతలోనే ప్రేమ్ అక్కడికి వచ్చి నందుని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడతాడు.
అప్పుడు దివ్య అయితే మామ్ ని ఈ ఫంక్షన్ కి పిలవరా అని అనడంతో అసలు తులసి ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అని అనసూయ అనడంతో పరంధామయ్య భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు. అప్పుడు నందు ఉన్న దివ్య మీ వదినలతో కలిసి నువ్వే తాతయ్య అని ఈ ఫంక్షన్ ను ఒప్పించాలి అనడంతో మీరే ఒప్పించొచ్చు కదా డాడ్ అని అంటుంది దివ్య.
నా మాట వినడు దివ్య నువ్వే ఎలాగో అలాగా ఒప్పించు అని అంటాడు. అప్పుడు అనసూయ ఇదంతా తులసి వల్లే ఆ తులసి ఇంటి నుంచి వెళ్లిపోయి కూడా సాధిస్తోంది అంటూ అనసూయ కూడా తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు తులసి తల్లి ఏడుస్తూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి వచ్చి ఏమయింది అమ్మ ఎందుకు బాధపడుతున్నావు అని అంటుంది.
నాతో కొద్దిరోజులు ఉంటాయని మాట ఇచ్చి ఇప్పుడు నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావ్ అనడంతో అమ్మ నువ్వు కూడా మోసం అనే పదం ఉపయోగించొద్దు మా ఇంట్లో వాళ్ళు ఆ పదం ఉపయోగించి నా మనసును ముక్కలు చేశారు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది తులసి. ఇప్పుడు తులసి వాళ్ళ అమ్మకి చెబుతూ నన్ను వదిలేసి అమ్మ నేను ఇప్పుడిప్పుడే మనుషులు ఎలాంటివారో నేర్చుకుంటున్నాను అని అంటుంది.
అప్పుడు తులసి వాళ్ళ అమ్మ తులసి మాటలకు సరే అని అంటుంది. మరొకవైపు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఆపిల్స్ కోస్తూ ఉండగా ఇంతలో సామ్రాట్ తులసి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఏంటి తులసి గురించి ఆలోచిస్తున్నావా తులసి తో పాటు ఇల్లు వెతకడానికి వెళ్తున్నావా అనడంతో అవును ఏం వెళ్లకూడదా అని అంటాడు.
ఇల్లు వెతకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తులసి గారి కోసం ఇంటిని మొత్తం సెట్ చేశాను అనడంతో వెంటనే వాళ్ళ బాబాయ్ తులసీ నీ పెళ్లి చేసుకోవడానికి నా అనడంతో ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు తులసి ఒంటరిగా కూర్చోగా ఇంతలోనే దివ్య ఫోన్ చేసి ఫుల్ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమైందమ్మా దివ్య ఎందుకు అలా ఏడుస్తున్నావ్ ఎవరైనా ఏమైనా అన్నారా అని అడగగా లేదు మమ్ నాకు పదే పదే నువ్వు గుర్తుకు వస్తున్నావు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అంటూ దివ్య ఏడుస్తుంది.
అప్పుడు తులసి ఏం కాదు రేపు మాపో ఒక ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన నువ్వు అమ్మ మీద ఇలా హోప్స్ పెట్టుకోకూడదు అని ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత పరంధామయ్య పేపరు చదువుతూ ఉండగా ఇంతలో అనసూయ అక్కడికి వచ్చి కాఫీ ఇస్తుంది. అప్పుడు పరంధామయ్య వద్దు అనడంతో వారిద్దరూ కాసేపు వాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు దివ్య ప్రేమ్ శృతి వాళ్ళు బర్త్డే పార్టీ ఫుల్ గ్రాండ డ్ గా చేద్దాం తాతయ్య అనగా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా అని అంటాడు.