Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమ్ తన కారు కి ఆటో అడ్డం ఉండటంతో ఆటో ని కాలితో తంతాడు. అది చూసిన సౌర్య కోపంతో మేటర్ ఎక్కువ చేస్తే మీటర్ పగిలిపోతుంది అంటూ ప్రేమ్ ని బెదిరిస్తుంది. మరొకవైపు సౌందర్య, ఆనందరావు, హిమ లు కూర్చొని భోజనం చేస్తుండగా హిమ మాత్రం తినకుండా ఆలోచిస్తూ ఉంటుంది.
హిమ, సౌర్య ని తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య బాధపడకు తిను అని ఓదారుస్తుంది. ఈ క్రమంలోనే ఆనందరావు సౌర్య కావాలనే కనిపించకుండా తప్పించుకుని తిరుగుతోంది ఏమో అని అంటాడు. మరొకవైపు సౌర్య చంద్రమ్మ దంపతులను తీసుకొని సత్య ఇంటికి వెళ్తాడు.
సౌర్య చంద్రమ్మ దంపతులను తన ఇంట్లో చూసిన ప్రేమ్ వారిపై విరుచుకు పడతాడు. అప్పుడు సౌర్య జరిగినదంతా సత్యకు వివరిస్తుంది. అలా వారిద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరుగుతుంది. ఇక చివర్లో వెళ్ళిపోతూ సౌర్య, ప్రేమ్ కి వార్నింగ్ ఇచ్చి వెళుతుంది.
మరొకవైపు నిరూపమ్, హిమ కలిసి స్వప్న ఇంటికి వెళ్తారు. అక్కడ స్వప్న,హిమ ని నానా మాటలు అని హిమ ఏడిపిస్తూ బాధ పెడుతుంది.హిమ నే కార్తీక్,దీప లను చంపింది అన్నట్టుగా స్వప్న మాట్లాడడంతో హిమ బాధపడుతూ ఉంటుంది.
ఇక మరొకవైపు హాస్పటల్ లో హిమ, సౌర్య,నిరూపమ్,ప్రేమ్ లు ఎదురు పడతారు. ఈ క్రమంలోనే నిరూపమ్ తన గురించి ప్రేమగా మాట్లాడటం తో సౌర్య,నిరూపమ్ తో ప్రేమలో పడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్యని సౌర్య చూస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World