Karthika Deepam: నిజం తెలుసుకున్న సౌర్య… ఆత్మలుగా మారిన దీప కార్తీక్!

Karthika Deepam:బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే ఎపిసోడ్ విషయానికి వస్తే… గత ఎపిసోడ్ లో భాగంగా హిమ శ్రీరామ్ నగర్ బస్తీలో ఉన్న ఇంటికి వెళ్లి అక్కడ కార్తీక్ ఫోటో దగ్గర దీపం పెట్టి వాళ్ళని తలుచుకుని ఏడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఇక కార్తీక్ ఫోటోకి దండం పెట్టుకున్న తర్వాత ఆ ఇంటిలో ఉన్న ఫోటోలు చూసి ఇన్ని రోజులు మోనిత ఆంటీ మమ్మీ డాడీ లను ఇంత ఇబ్బంది పెట్టిందా?ఈ ఫోటోలు చూసి చిన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు అన్ని ఇప్పుడు అర్థం అవుతున్నాయి అంటూ చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకొని బాధపడుతుంది. ఇక సౌర్య (జ్వాల) శ్రీరామ్ నగర్ బస్తీ కిరాయి రావడంతో ఆటోలో అటు వెళుతుంది. ఇక కార్తీక దీప ఉన్న ఇంటిలో లైట్లు వెలగడంతో ఎవరో ఈ ఇంటిలో ఉన్నారని, వెళ్లి చూద్దామని ఆటో దిగి లోపలికి వెళుతుంది.

సౌర్య లోపలికి వెళ్లే సమయానికి హిమ అక్కడ ఉండదు. లోపలికి వెళ్ళిన సౌర్య కార్తీక్ ఫోటోకి దండ వేసి ఉండటం అలాగే కార్తీక్ మోనిత పూజ చేస్తున్న ఫోటో, మోనిత ఆనంద్ తో కలిసి తీసుకున్న ఫొటోలను చూసి సౌర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement

ఆ ఫోటోలను చూసి అప్పుడంతా మోనిత వల్ల అమ్మ అన్ని కష్టాలు పడిందా అందుకే అంతగా ఏడ్చేదా… ఇక ఆనంద్ మోనిత ఆంటీ కొడకా, అంటే ఆనంద్ నాకు తమ్ముడు అవుతారా… ఇలా నిజాలు అని తెలుసుకున్న సౌర్య కోపంతో రగిలిపోతుంది. ఇకపై నాకు అక్క చెల్లెల బంధమే కాదు అక్కాతమ్ముళ్ల బంధం కూడా నచ్చదు అంటూ రగిలిపోతుంది. ఇక ఫోటో ముందు దీపం వెలగడంతో ఈ ఇంట్లో ఎవరో ఉంటారని ఇంట్లో ఎవరూ లేరా అని సౌర్య పిలుస్తుంది.

సౌర్య అలా పిలవడంతో పైన నుంచి ఒక ముసలావిడ రావడంతో ఈ ఇంట్లో ఎవరూ లేరా అని అడుగుతుంది ఇక ఆ ముసలావిడ ఈ ఇంట్లో ఎవరూ లేరమ్మా, ఈ ఇంటి గురించి బస్తీలో ఎన్నో కథలు చెబుతున్నారు. ఇంటి లోపల నుంచి ఏవో మాటలు వినబడుతున్నాయి. వింత శబ్దాలు వస్తుంటాయని అందరూ మాట్లాడుతుంటారు.

Advertisement

నేను కేవలం ఈ ఇంటిని శుభ్రం చేసి వెళ్తుంటానని సమాధానం చెప్పింది. ఇందాకే నీ వయసున్న అమ్మాయి వచ్చి ఇక్కడ దీపం పెట్టి దండం పెట్టుకుని వెళ్ళింది. తను బాగా ఏడుస్తూ ఉంది అని ఆవిడ చెప్పడంతో కచ్చితంగా హిమ వచ్చి ఉంటుంది అని భావించిన సౌర్య బయటకు వెళ్లి హిమ హిమ అని గట్టిగా అరుస్తుంది. ఎక్కడికి వెళ్లిన నిన్ను వదలను అంటూ తన పై కోపం పెంచుకుంటుంది.

మరోవైపు స్వప్న ప్రేమ్ దగ్గరకు వచ్చి గుడికి వెళ్దాం అని బలవంతంగా తనని గుడికి తీసుకెళ్తుంది. మరోవైపు సౌందర్య హిమకు పువ్వులు పెడుతూ అచ్చం పెళ్లికూతురులా తయారు చేసి ఉంటుంది. తనని చూసిన ఆనందరావు హిమను పెళ్లికూతురిని రెడీ చేసినట్లు చేస్తున్నావు అని అడుగుతారు.

Advertisement

ఆ మాటకు సౌందర్య పెళ్లి అంటే ఇష్టం లేదు కదా తన దగ్గర ఎందుకు ఈ ప్రస్తావన తీసుకు వస్తారని ఉద్దేశపూర్వకంగా అంటుంది.అయినా పెళ్లి ఇష్టం లేని తన దగ్గర పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతారు, అయినా తనని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతారా ఏంటి? అని సౌందర్య అనడంతో నానమ్మ…ప్లీజ్ సౌర్య దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను, ఒకవేళ దొరకకపోతే జీవితంలో పెళ్లే చేసుకోను ఇదే నాకు సౌర్య వేసిన శిక్ష అంటూ ఎమోషనల్ అవుతుంది. మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement