Devatha july 21 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ, దేవి ఇద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో మాధవ దేవి గెలిచిన ట్రోఫీని తీసుకుని వచ్చి రామ్మూర్తి దంపతులకు ఇవ్వడంతో వాళ్లు దేవి గెలిచింది అని సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు దేవి, రాధ ఎక్కడ అని అడగగా వాళ్లు షాక్ లో ఉన్నారు దేవి గెలవడానికి కారణం ఆఫీసర్ సారు అంటూ పొగుడుతూ ఉంటారు అంటూ కోపంగా మాట్లాడుతాడు మాధవ. అప్పుడు రామ్మూర్తి దంపతులు ఆఫీసర్ కు చెప్పావా అని అడగగా వేరే వాళ్ళ ద్వారా చెప్పించాను అని అంటాడు మాధవ.
ఇక మరొకవైపు ఆదిత్య ఒంటరిగా ఇంటికి వెళ్లడంతో దేవుడమ్మ దంపతులు దేవి ఎక్కడ అని ఆనందంగా అడగగా ఆదిత్య బాధతో కనిపిస్తాడు. అప్పుడు దేవుడమ్మ ఇంట్లో అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ గా ఆదిత్య మాత్రమే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత రాధ, దేవిని ఒళ్ళో పడుకోబెట్టుకుని దేవి మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.
Devatha : తండ్రి విషయంలో దేవి మాటలకు కన్నీళ్ల పర్యంతమైన రుక్కు !
అప్పుడు దేవి నాయన గురించి కదా నువ్వు బాధపడేది అంటూ ఆదిత్య గురించి నానా రకాలుగా మాటలు ఉంటుంది. అప్పుడు రాధ,ఆదిత్య గురించి ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా కూడా దేవి వినిపించుకోదు. మన సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్న మాధవ నాయన నా సొంత నాయన అనడంతో రాధ షాక్ అవుతుంది. అంతేకాకుండా దేవి నాయన దగ్గరే ఉండి ఆఫీసర్ సార్ లాగా కలెక్టర్ అయ్యి నిన్ను మంచిగా చూసుకుంటాను.
ఆ కసాయి తండ్రిని వదలను ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను అంటూ రాధను తన తండ్రి ఫోటో అడుగుతుంది. అప్పుడు రాదా మీ నాయన అలాంటి వాడు కాదమ్మా అని దేవికి చెప్పి ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవి మాత్రం తన తల్లి బాధను చూడలేక పోతుంది. మరొకవైపు మాధవ జరిగిన విషయం గురించి తలుచుకుని ఆనందపడుతూ నేనే గెలిచాను అని అనుకుంటూ ఉండగా.
ఇంతలో రాధ అక్కడికి వచ్చి దేవికి ఎందుకు అలా చెప్పావు అని కోపంతో రగిలిపోతుంది. అప్పుడు మాధవ తెలివిగా మంచి తిరగడం కోసమే చెప్పాను నా బిడ్డకు తల్లి కావాలి నాకు నువ్వు కావాలి అని అంటున్నాడు. ఇక మాధవ మాటలు కోపంతో రాధ మాధవని కొట్టడానికి చేయి లేపుతుంది. ఇదే చివరిసారిగా చెప్తున్నా అంటూ మాధవకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది రాధ.
అయినా కూడా మాధవ, తన బుద్ధిని చూపిస్తూ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. మరొకవైపు దేవుడమ్మ దంపతులు పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి వచ్చినా సత్య,ఆదిత్య ఎందుకో బాధపడుతున్నాడు. ఆదిత్యను చూస్తుంటే అమెరికాకు వచ్చేలా లేడు అని అనడంతో వెంటనే దేవుడమ్మ ఆదిత్యను పిలిపిస్తుంది.
Read also : Devatha july 20 today Episode : దేవికి ఆదిత్య గురించి చెడుగా చెప్పిన మాధవ.. ఎమోషనల్ అవుతున్న రాధ..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World