Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయిన అనసూయ, పరంధామయ్య లు ఎక్కడికి వెళ్లారు తెలియక వృద్ధాశ్రమానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి వృద్ధాశ్రమంలో నాకు నా భార్యకు చోటు కావాలి అని పరంధామయ్య ఇన్చార్జిని వేడుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇన్చార్జి మాత్రం మీరు అబద్ధాలు చెబుతున్నారు మీరు అనాధలు కాదు ఇంట్లో నుంచి పోట్లాడి బయటకు వచ్చేశారు అని చెప్పగా లేదు ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు అని పరంధామయ్య ప్రశ్నిస్తాడు.
ఇందాకే మీ మనవడు వచ్చి మీ కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళాడు. మీరు కనిపిస్తే ఇన్ఫామ్ చేయమని చెప్పాడు అని అనడంతో అప్పుడు పరంధామయ్య మీకు దండం పెడతా మేము ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పకండి అని అనడంతో అందుకు ఆ మేనేజర్ సరే అని అంటాడు. అనసూయ కూడా అక్కడికి వచ్చి మేనేజర్ ని వేడుకుంటుంది.
మరొకవైపు పరంధామయ్య, అనసూయ కోసం వెతికి వెతికి మాధవి, తులసీ లు ఇంటికి వెళతారు. ఇక ఇంటికి వెళ్ళగానే నందు మా అమ్మ నాన్న ఎక్కడ అంటూ తులసిని నిలదీస్తాడు. అప్పుడు లాస్య కూడా ఎందుకు సపోర్ట్ గా మాట్లాడుతూ తులసిపై లేనిపోని నిందలు వేస్తూ నానారకాలుగా మాటలు అంటుంది. నందు కూడా మా అమ్మ నాన్న ను తీసుకువస్తాను అంటూ శపథం చేసావు కదా అంటూ తులసి నీ మాటలతో దెప్పి పొడుస్తూ ఉంటాడు.
ఇక తులసి ఎంతసేపటికి మాట్లాడక పోయేసరికి సహనం కోల్పోయిన మాధవి లాస్య ను హెచ్చరిస్తుంది. అయినా కూడా లాస్య తగ్గకపోవడంతో అప్పుడు మాధవి లాస్య చెంప పగలగొడుతుంది. ఇంకొకసారి మా వదిన గురించి తప్పుగా వాగావంటే నాలుక చీరేస్తా అంటూ లాస్య కు వార్నింగ్ ఇస్తుంది మాధవి.
అప్పుడు నందు లాస్య కు సపోర్ట్ రాగా కోపంతో మాధవి నువ్వు మాట్లాడకు అని నందు పై తిరగబడుతుంది. అప్పుడు నందు ఏమి చేయలేక సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ తర్వాత అభి, దివ్య లు భోజనం తీసుకొని వచ్చి తినమని బ్రతిమలాడుతూ ఉంటారు. మరొకవైపు లాస్య కు జరిగిన అవమానం కు కోపంతో రగిలిపోతూ తులసి, మాధవి ల పై లేనిపోని మాటలు చెప్పి నందు ని రెచ్చ కొడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.