Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Intinti Gruhalakshmi serial Oct 17 Today Episode : తులసి కోసం సర్ప్రైజ్ ను ప్లాన్ చేసిన పరంధామయ్య.. నందుని కన్విన్స్ చేస్తున్న లాస్య ..?

Intinti Gruhalakshmi serial Oct 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటీ గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో తులసి కొడుకు కోడలు ఫస్ట్ నైట్ ను ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ తులసి పని చేసుకుంటూ ఉండగా అప్పుడు దివ్య అక్కడికి వచ్చి అమ్మ నేను సహాయం చేయాల ... Read more

By Ramesh Babu

Published on: October 17, 2022 10:26 AM

Updated on: July 12, 2025 9:17 PM

Lasya misleads Anasuya into doubting Tulasi's character in todays intinti gruhalakshmi serial episode

---Advertisement---

Intinti Gruhalakshmi serial Oct 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటీ గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో తులసి కొడుకు కోడలు ఫస్ట్ నైట్ ను ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ తులసి పని చేసుకుంటూ ఉండగా అప్పుడు దివ్య అక్కడికి వచ్చి అమ్మ నేను సహాయం చేయాల అని అడగగా వెంటనే తులసి నాకు సహాయం చేయకపోయిన పరవాలేదు నా పనులు చెడగొట్టకుండా ఉంటే చాలు అని అంటుంది. అప్పుడు దివ్య నాకన్నా నీకు కోడలు ఎక్కువైపోయారా. ఈరోజు నీ కోడలు నీకు ఎలా సహాయం చేస్తారో నేను చూస్తాను అని అంటుంది దివ్య. నిన్న రాత్రి నువ్వే కదా మీ కోడలిని తయారు చేసి గదిలోకి పంపావు వాళ్ళు అంత తొందరగా వస్తారా అని అనగా ఇంతలోనే అంకిత అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతుంది.

Lasya misleads Anasuya into doubting Tulasi's character in todays intinti gruhalakshmi serial episode
Lasya misleads Anasuya into doubting Tulasi’s character in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు దివ్య ఏంటి హీరోయిన్ లెగిస్తే హీరో మళ్ళీ ఆపేస్తారు కదా అని దివ్య అనగానే నీ వయసుకు తగ్గ మాట్లాడడం నేర్చుకోవే నాకన్నా ముందు హీరో లేచి ఏదో హాస్పిటల్ లో కేసు ఉందని వెళ్ళిపోయారు అని అంటుంది అంకిత. ఆ తర్వాత గదిలో నుంచి శృతి బయటకు వస్తూ ఉండగా తాతయ్య ఉంటే చూసుకొని వెళ్ళు అని జాగ్రత్తలు చెబుతారు. ఎందుకు అని అడుగుతూ ఉండగానే ఇంతలోనే అక్కడికి పరంధామయ్య వస్తాడు.

అప్పుడు ఆ మాటలు అన్ని విన్నావా తాతయ్య అని అనగా ఆ విన్నాను నన్ను సీసీ కెమెరా అంటావా అని అనసూయని ఒక ప్లేట్ లో స్వీట్స్ తీసుకొని రమ్మని చెప్పి ప్రేమకి ఇస్తాడు. ఎందుకు తాతయ్య అని అనగా నువ్వు గుడ్ న్యూస్ చెప్పే వరకు ఇవి తింటూనే ఉండాలి అని అనడంతో ప్రేమ్ భయంతో బయటికి పరుగులు తీస్తాడు. ఇంతలోనే అనసూయ కి లాస్య ఫోన్ చేస్తుంది.

Intinti Gruhalakshmi అక్టోబర్ 17 ఎపిసోడ్ : తులసి మీద కోపంతో రగిలిపోయిన అనసూయ.. 

అప్పుడు తెలిసి ఫోన్ ఎత్తడంతో అత్తయ్య మేము ఎవరి జోలికి పోలేదు ఎవరికి ద్రోహం చేయలేదు మా పని మేము చేసుకుంటూ ఉంటే మా మీద కళ్ళు కడుతున్నాయి మొన్న జరిగిన గొడవ వల్ల ఉద్యోగం మానేశాడు అయ్యా అని అంటుంది. దాంతో అనసూయ మాటలు నిజం అని నమ్మి తులసి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు అనసూయ సామ్రాట్ ఉద్యోగం నుంచి పీకేసాడా లేక నందు మానేసాడా అని అనగా ఎవరైనా అన్ని మాటలు మాట్లాడితే మానేయకుండా ఎలా ఉంటాడు అత్తయ్య అని అంటుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఈ బాధ నీతో చెప్పుకున్నాను మీరు ఇవన్నీ తులసితో వెళ్లి ఆడకూడదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు అనసూయ లాస్య మాటలు నిజం అని నమ్ముతుంది.

అప్పుడు తులసి అక్కడికి వచ్చి అత్తయ్య చిన్న పని ఉంది ఆఫీస్ కి వెళ్తున్నాను అని అనగా ఎందుకమ్మా పదేపదే నా పర్మిషన్ తీసుకుంటావు ఎవరైనా చూస్తే నేను అదుపులో పెట్టుకున్నాను అనుకుంటారు అని అంటుంది. అప్పుడు తులసి కూడా అత్తయ్యకి నా మీద ఎప్పుడూ కోపం పోతుందో చెప్పడం దగ్గరవుతామో అని అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

అనసూయ సైలెంట్ గా ఉండడం చూసి అవి అక్కడికి వచ్చి ఏమైంది నానమ్మ అని అడగగా అప్పుడు అనసూయ జరిగింది మొత్తం అభికి చెబుతుంది. ఇప్పుడు అభి వెళ్లి అమ్మని నిలదీయొచ్చు కదా నానమ్మ అని అనగా మొన్న చేసిన దానికి మొండిగా తయారైంది మళ్లీ నావల్ల ఇంట్లో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి అనసూయ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సామ్రాట్ పరంధామయ్య కి ఫోన్ చేసి మీరు చెప్పిన పని అయిపోయింది అని అనగా హమ్మయ్య మంచి పని చేశారు రేపు పండుగకి తులసికి సప్రైజ్ ఇవ్వాలి అని అంటాడు పరంధామయ్య.

ఆ తరువాత ఇద్దరు గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మంచి పని చేస్తున్నందుకు సామ్రాట్ ఆనందపడుతూ ఉండగా ఇంతలో వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఏం జరిగింది రా అంత సంతోషంగా ఉన్నావు అని అడగగా అప్పుడు సామ్రాట్ ఒక ఫ్రెండ్ కి హెల్ప్ చేశాను అందుకే ఇంత ఆనందంగా ఉంది బాబాయ్ అని చెబుతాడు. ఆ తర్వాత నందు పూర్తికి ఎసరు పెడుతూ లాస్య సామ్రాట్ దగ్గరికి కన్విన్స్ చేయడానికి వెళుతుంది.

అప్పుడు లాస్యతో నువ్వు నెక్స్ట్ టైం నుంచి వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని రా అలాగే లోపలికి వచ్చేటప్పుడు డోర్ లాక్ చేసి రా అని అనడంతో సరే సరే అని అంటుంది లాస్య. అప్పుడు ఏంటి చెప్పు లాస్య అని అనగా ప్రాజెక్టు గురించి లాస్య ఏవేవో చెబుతూ ఉండటంతో అవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు ముందు నందగోపాన్ని పిలుచు రాలేదా అని అనగా ఉద్యోగం మానేశాడు సార్ అని అంటుంది లాస్య. అప్పుడు సామ్రాట్ మనుషులు ఇంతే నమ్మకం పోతుంది ఉద్యోగం కావాలి అంతే కాళ్లు పట్టుకుంటారు అవసరం తీరిపోయాక ఇలా చేస్తారు అని కోపంతో మాట్లాడగా లాస్య మాత్రం మీరేం భయపడకండి సార్ పనులు ఆగిపోవు కంపెనీ పరువు నిలబెడతాను అని అంటుంది.

Read Also : janaki kalaganaledu Oct 17 Today Episode : మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి.. కడుపు నొప్పితో అల్లాడుతున్న జెస్సి..?

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.