Intinti Gruhalakshmi Weekly Highlights : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ వారంలో జులై 25 నుంచి జూలై 30 తేదీ వరకు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ జరిగిన హైలెట్స్ ఇవే….. జూలై 25 తేదీన జరిగిన ఎపిసోడ్.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ జరిగిన ఈ ఎపిసోడ్ లో నందు లాస్య కొత్త బిజినెస్ ఐడియాలను సామ్రాట్ ఇచ్చిన ప్లాన్ లో భాగంగా ఇంటర్వ్యూ జరుగుతుంది ఆ ఇంటర్వ్యూ కి తులసి కూడా వస్తుంది తులసి తన మ్యూజిక్ స్కూల్ ఐడియాతో వస్తుంది.
తులసిని అక్కడ చూసి లాస్య వెటకారం ఆడుతుంది… తులసిని సామ్రాట్ బాబాయ్ చూసి బాగున్నావా నడుపుతాడు. తరువాత సామ్రాట్ దగ్గరికి వెళ్లి తన బిజినెస్ ఐడియా ను తులసి చెబుతుంది. సామ్రాట్ కు తులసి మ్యూజిక్ స్కూల్ ఐడియా బాగా నచ్చింది వెంటనే పెట్టుబడికి పెట్టమని నందు కి ఆర్డర్ వేస్తాడు.. తులసి కుటుంబ సభ్యులతో తన బిజినెస్ ఐడియా నచ్చిందని చెబుతుంది. దానితో కుటుంబ సభ్యులంతా సంతోష పడుతున్నప్పుడు.. అక్కడికి అభి కూడా వస్తాడు…
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ జులై 26 జరిగిన ఎపిసోడ్… తులసి కోరుకున్నట్లు తిరిగి ఇంటికి వచ్చిన అభి… అంకితం కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు.. ప్రేమ్. కూడా ఇంటికి వస్తాడు. శృతి ఎందుకు రాలేదని ఇంట్లో వాళ్ళు అడుగుతారు అప్పుడు శృతి గురించి ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్తాడు. తులసి వాళ్ళింటికి సంగీతం నేర్చుకోవడానికి హనీ వస్తుంది తులసిని హనీ కృష్ణుడు వేషం వేస్తావా అని అడుగుతుంది. శృతి ప్రేమ కోసం ఇంటికి వెళ్తుంది అక్కడ ప్రేమ్ కనిపించడు. అక్కడికి శృతి వాళ్ళ అత్త వస్తుంది వాళ్ళింటికి తీసుకెళ్తుంది… సామ్రాట్ వాళ్ళింటికి నందు లాస్య వెళ్తారు ప్రాజెక్టు పని మీద.. అక్కడికి తులసి వస్తుంది పాపని కృష్ణుడులా తయారు చేస్తుంది…
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ జూలై 27 జరిగిన ఎపిసోడ్. తులసిని సామ్రాట్ హనీ కి డ్యాన్స్ నేర్పి ఒప్పిస్తాడు.. అప్పుడు తులసి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటుంది. హనీ కి డ్యాన్స్ నేర్పిస్తూ ఉండగా సామ్రాట్ పై తులసి పడుతుంది. అది చూసి నందు షాక్ అవుతాడు. నందుని లాస్య పొరపాటుగా పడిపోయిందా తులసి అంటుంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే తులసి ని కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో నిందిస్తుంది. ఇక అంకిత ను కన్విన్స్ చేసేందుకు అభి ప్రయత్నిస్తాడు. కానీ దానికి మాత్రం ఆమె సుముఖంగా ఉండదు. దీంతో ప్రేమ కూడా అభి కి కొన్ని విలువైన సలహాలు ఇస్తాడు.
Intinti Gruhalakshmi Weekly Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్.. ఏ రోజు ఎపిసోడ్ ఎలా సాగిందంటే?
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 28వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో.. లక్కీ తో తులసి మాట్లాడుతుండగా నందు, లాస్య వస్తారు. దీంతో సామ్రాట్ తన మీ కొడుకే నా అని అడుగుతాడు అప్పుడు అవునని అంటారు. ఆ తర్వాత లక్కీ నేనే గెలుస్తాను అంటూ సామ్రాట్ కి షాక్ ఇస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే లక్కీ మీకెలా తెలుసు అని సామ్రాట్ తులసిని ప్రశ్నిస్తాడు. కానీ ఆమె సమాధానం దాటవేసింది. అనంతరం హనీ తో కలిసి పర్ఫార్మెన్స్ చేయాల్సిన టీచర్ అక్కడ నుండి తప్పించుకుంది. ఇక కాంపిటీషన్ ప్రారంభంకాగానే లక్కీ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. కానీ హనీ టీచర్ మాత్రం కనిపించదు.
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్ లో.. హనీ తో కలిసి పర్ఫామెన్స్ చేయాల్సిన టీచర్ అక్కడ నుండి తప్పించుకుంది. ఇక ఈ విషయం తులసి సామ్రాట్ కి చెప్తుంది. అప్పుడు అతడు అక్కడ మొత్తం వెతుకుతాడు కానీ ఆమె కనిపించలేదు. దీంతో తులసి వెళ్లి టీచర్ స్థానంలో హనీ తో కలిసి డాన్స్ వేస్తుంది. దీంతో సామ్రాట్ సంతోషించగా.. నందు, లాస్య షాక్ అవుతారు. దీంతో హనీ, లక్కీ విజేతలుగా నిలుస్తారు. అప్పుడు హనీ రైస్ తీసుకోవడానికి తులసిని కూడా స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తుంది. ఆమె కూడా వెళుతుంది.
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 30వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్ లో.. కాంపిటీషన్ లో విజయం సాధించిన తర్వాత హనీ సంతోషంగా ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ల తాతయ్య తండ్రి సామ్రాట్ తో తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఆ సమయంలో సామ్రాట్ తులసి గొప్పతనం గురించి వాళ్ళ బాబాయ్ తో మాట్లాడతాడు. అనంతరం తులసి ఇంటికి నందు, లాస్య మ్యూజిక్ స్కూల్ ప్లాన్ తీసుకొని వస్తారు. అప్పుడు వాళ్ళని పరంధామయ్య, అనసూయ అవమానిస్తారు. తులసి కూడా వింత ప్రవర్తన తో ఇబ్బంది పెడుతుంది. కానీ నందు మాత్రం తులసి చెప్పినట్లు మర్యాద చూపిస్తాడు.