Intinti Gruhalakshmi : అభిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తులసి బెయిల్ పేపర్స్ తీసుకురాగానే ఇంతలో మరో షాక్​!

Intinti Gruhalakshmi Today Episode Feb 19 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తాజా ఎపిసోడ్​లో శనివారం ఎపిసోడ్ 560 హైలైట్స్ గురించి ఓ లుక్కేద్దాం.  అభిని వెతుక్కుంటూ వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. దీంతో అభిని కలిసి ఏంట్రా ఇది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకోసం పోలీసులు వెతుకుతున్నారు మామ్.  తల్లి మాట వినకపోతే బిడ్డ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఇప్పుడు తెలిసివచ్చింది మామ్ అంటాడు. ఇక నా వల్ల కావట్లేదు నేను బతికున్నానో.. చస్తానో నాకే అర్థం కావడం లేదు. ఎవరైనా చావంటే భయపడతారు. నాకు బతకాలంటే భయమేస్తుంది మామ్ అంటాడు అభి. నువ్వేం భయపడకు. ఇఫ్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు. నీ అమ్మ దగ్గర ఉన్నావు. నువ్వేం టెన్షన్ పడకు.

intinti-gruhalakshmi-19-february-2022-full-episode-preview
Intinti Gruhalakshmi Today Episode Feb 19

అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది తులసి. నీ మీద ప్రామిస్​ చేసి చెబుతున్నా మామ్.. నేను ఎవ్వరినీ చంపడానికి చూడలేదు. నేను చేసిందల్లా 10 లక్షలు అప్పుగా తీసుకోవడమే. నా ఫ్రెండ్ మనోజ్ గాడికి 10 లక్షలు ఇచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టమన్నాను. కానీ.. ఆ డబ్బుతో వాడు పారిపోయాడు. ఆ తర్వాత వాడిని పట్టుకొని నా డబ్బు నాకిచ్చేయమని గొడవ పెట్టుకున్నాను. అంతే కానీ.. వాడిని నేను చంపాలనుకోలేదు. అని అంటాడు. ఇంతలో పోలీసు జీప్ వచ్చి అక్కడ ఆగుతుంది. దీంతో అభి, తులసి షాక్ అవుతారు.

Intinti Gruhalakshmi Today Episode Feb 19 : తులసికి మరో షాక్​!

ఆ తర్వాత భయంతో అభి పారిపోగా.. పోలీస్ వచ్చి.. తులసిని లాక్కెళ్తాడు. మా వాడు ఏ తప్పు చేయలేదు.. అంటుంది తులసి. కానీ.. ఎస్ఐ మాత్రం వినడు. అవును.. మధర్ ఇండియా నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు నీ మొగుడు ఏడి అని అడుగుతాడు ఎస్ఐ. నాకు భర్త లేడు అంటుంది తులసి. మెడలో తాళి ఉంది కదా అని హేళన చేస్తాడు ఎస్ఐ. అవును.. మొగుడు లేడన్నావు.. మరి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు. కనీసం ఎవడికి పుట్టాడో అదైనా తెలుసా అని అంటాడు పోలీస్. దీంతో ఒరేయ్ అంటూ అభి కోపంగా వెళ్లి ఆ ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు.

Advertisement

దాంతో పోలీస్​కు ఒళ్లు మండి.. అభిని లాక్కెల్లి పోలీస్ జీప్​లో పడేస్తాడు. నేను నీకోసం బెయిల్ తీసుకొస్తా.. టెన్షన్ పడకు అని అభికి.. తులసి ధైర్యం చెప్తుంది. మరోవైపు అభి ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటారు. తులసి ఇంటికి రాగానే.. అభి కనిపించాడా.. అని అందరూ అడుగుతారు.  తులసి కాసేపు సైలెంట్​గా ఉండిపోయి.. కనిపించాడు అని అంటుంది. మరి ఎందుకు తీసుకురాలేదని అందరూ అడగ్గా.. పోలీసులు తీసుకెళ్లారని చెబుతుంది తులసి. ఆ తర్వాత జరిగిదంతా చెప్పాక.. అంకిత వెక్కివెక్కి ఏడుస్తుంది. ఆ తర్వాత తులసి బెయిల్ పేపర్స్ తీసుకుని పోలీస్ స్టేషన్​కు వెళ్లగా.. పోలీస్ రివర్స్​ అవుతూ.. వాడ్ని అరెస్ట్ చేస్తే కదా.. అని అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుదో తెలియాలంటే.. ఇంటింటి గృహలక్ష్మీ తర్వాత భాగం చూడాల్సిందే.

Read Also : Intinti Gruhalakshmi : పోలీస్‌ స్టేషన్‌లో తులసి, అభి… ఈ గండం గట్టక్కెంచే నాథుడెవరు..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel