Intinti Gruhalakshmi june 14 Today Episode : కుటుంబంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న తులసి.. తట్టుకోలేక తులసి పై ఫైర్ అయిన లాస్య?

Updated on: June 14, 2022

Intinti Gruhalakshmi june 14 Today Episode : కుటుంబ కథా నేపథ్యంలో బుల్లితెరపై ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న గృహ లక్ష్మి సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ లో ప్రతి కుటుంబంలో ఎదురయ్యే కష్టాలను గురించి ఎంతో అద్భుతంగా చూపించారు.ఇకపోతే ప్రస్తుతం ఈ సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతూ విపరీతమైన ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే..

Intinti Gruhalakshmi june 14 Today Episode
Intinti Gruhalakshmi june 14 Today Episode

శృతి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తూ ఉన్న సంఘటనను గుర్తుచేసుకుని తులసి ఎంతో బాధ పడుతుంది.ఇక్కడే ఉంటే ప్రేమ్ ఎదగలేదని తనని బయటికి పంపిస్తే కనీసం తను బతకడానికి కూడా కష్టంగా మారిపోయింది ఇదంతా తన వల్లే జరిగింది అంటూ తులసి బాధపడుతూ దిగాలుగా కూర్చుని ఉంటుంది. ఇక అది చూసిన తన అత్తమామలు నువ్వు ఇదివరకు తులసిల మాకు కనిపించకూడదు.నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే మేము తట్టుకోలేమని పరంధామయ్య అంటే తులసి వాళ్ళ కోసం తన మనసును మార్చుకుని వారితో సరదాగా మాట్లాడుతుంది.

అంతేకాకుండా రేపు మన ఫ్యామిలీ అందరూ కలిసి సరదాగా బయటికి వెళదామని తులసి చెప్పగా దివ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీంతో అనసూయ గుడికి వెళ్దాం అని అనగా దివ్య మాత్రం లేదు షాపింగ్ మాల్ వెళ్లి సరదాగా ఎంజాయ్ చేద్దాం అని చెబుతుంది. మరోవైపు శృతి తానే పనిమనిషిగా చేస్తున్న విషయాన్ని ప్రేమ్ కి చెప్పాలని అనుకుంటుంది. అయితే అప్పుడే ప్రేమ్ తన స్నేహితుడు కథ గురించి చెప్పడంతో తన కథ కూడా ఇంచుమించు అలా ఉండేసరికి తను పనిమనిషిగా చేస్తున్న విషయాన్ని చెప్పకపోవడమే మంచిదని శృతి భావిస్తుంది.

Advertisement

మరోవైపు లక్కీ ఇంట్లో దిగాలుగా కూర్చుని ఉంటాడు అదేసమయంలో ఫోన్ మాట్లాడుతూ అటువైపు వస్తాడు. లక్కీని అలా చూసి ఫోన్ కట్ చేసి నందు ఇప్పుడు వీడితో మాట్లాడితే ఏదో ఒకటి వెటకారంగా మాట్లాడుతాడు అని సందేహ పడుతూనే లక్కీని పలకరిస్తాడు.ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది బయటకు వెళ్దామంటే అమ్మ ఎంతో బిజీగా ఉంది అంటాడు.ఆ సమయంలో నందు తనని నేను బయటికి తీసుకెళ్తాను అనగా లక్కీ మాత్రం నీతో రావడం నాకు ఇష్టం లేదు అంటాడు. అయినా తప్పదు కనుక వస్తాను అని లక్కీ చెప్పగా నందు తనని డాడీ అని పిలుస్తావని లక్కీ అని అడగగా వెంటనే ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటూ వెటకారంగా మాట్లాడుతాడు.

ఇక శృతి ప్రేమ్ కూడా సరదాగా కాసేపు గడపడానికి బయటకు వెళ్తారు. అదే సమయంలో మాల్ లో తులసి తన అత్తయ్య మామయ్యలు దివ్యతో కలిసి ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక ప్రేమ్ ఎవరో ఆవిడని చూసి తన తల్లి అని భ్రమ పడతాడు.ఆ సమయంలో శ్రుతి మాట్లాడుతూ నువ్వు ఎక్కువగా ఆంటీ ఆలోచనలు చేయడం వల్ల నీకు ఎవరిని చూసినా ఆంటీ అనే భావన కలుగుతుంది అంటూ సమాధానం చెబుతుంది.

ఇకపోతే తులసి వెళ్లిన మాల్ కి లాస్య నందు కూడా లక్కీ తో కలిసి వెళ్తారు.అయితే అక్కడికి వెళ్లగానే లక్కీ తెలిసిన చూసి వారి దగ్గరకు వెళ్లడంతో తులసి లక్కీతో ఎంతో సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తుండగా అది చూసిన లాస్య ఒక్కసారిగా తులసి పై ఫైర్ అవుతుంది. దీంతో తులసి వద్దకు వెళ్లి లాస్య తనని సూటిపోటి మాటలతో తనపై కోప్పడుతుంది.

Advertisement

Read Also :  Intinti Gruhalakshmi: అభిని నమ్మి మోసపోయిన అంకిత.. బాధతో కుమిలిపోతున్న తులసి..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel