Telugu NewsLatestKarthika Deepam serial Sep 27 Today Episode: గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు.....

Karthika Deepam serial Sep 27 Today Episode: గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు.. షాక్ లో మోనిత..?

Karthika Deepam serial September 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప వాళ్ళ అన్నయ్య కార్తీక్ నీ నాటకం చూడమని అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఈ రోజు ఎపిసోడ్ లో మోనిత ఇంట్లోకి వెళుతుండగా ఎవరో డిక్కీ లో నుంచి ఎవరో దిగినట్టు అనిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా శౌర్య ఉంటుంది. సౌర్యను చూసిన మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు సౌర్య నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడగగా మీ కారు అని తెలియక ఎక్కాను ఆంటీ అని అంటుంది. అయినా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనగా అమ్మ నాన్నలు బ్రతికే ఉంటారు అని చిన్న ఆశతో ఊరంతా తిరుగుతున్నాను అనడంతో మౌనిక షాక్ అవుతుంది.

Deepa's effort to remind Karthik about his past seems in todays karthika deepam serial episode
Deepa’s effort to remind Karthik about his past seems in todays karthika deepam serial episode

అప్పుడు కావాలనే మోనిత కొత్త డ్రామా క్రియేట్ చేస్తూ మీ అమ్మానాన్నలు లేరమ్మా చనిపోయారు. అంతేకాదు నా చేతులారా నేనే ఆ డెడ్ బాడీలకు పోస్టుమార్టం చేశాను వాళ్లు ఇంకా లేరు రారు అని చెప్పడంతో అప్పుడు శౌర్య,మోనిత మాటలు నిజం అని నమ్మి ఏడుస్తూ ఉంటుంది. మోనితా కూడా కావాలనే దొంగ నాటకాలు ఆడుతూ సౌర్యని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటుంది.

Advertisement

అప్పుడు దీప ఇంటి వైపు చూడగా దీప ఇంటికి తాళం వేసి ఉండడంతో ఊపిరి పీల్చుకుంటుంది. సరే సౌజన్య నేను మీ నానమ్మల దగ్గరికి పంపిస్తాను బస్సు ఎక్కిస్తాను వెళ్తావా అని అనగా లేదు ఆంటీ ఇక్కడికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్తాను అని అనడంతో సరే పదా అని అక్కడికి వెళుతుంది మోనిత. మరొకవైపు కార్తీక్ , నాటకం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే కార్తీక్ వెనకాల ఉన్న ఆడవారు ఆ నాటకం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

కార్తీకదీపం అంటే కార్తీక్ దీప అనే ఇద్దరు భార్యాభర్తల కథ అని అనడంతో వెంటనే కార్తీక్ షాక్ అయ్యే దీప అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య ఇద్దరు అక్కడికి ఏమైంది అని పరిగెత్తుకుంటూ రాగా. ఏమైంది డాక్టర్ బాబు అని అడగగా అక్కడ ఏంటి అనడంతో కార్తీకదీపం అని అంటుంది దీప. అది తెలుసు అది ఏంటి కార్తీకదీపం అని ఎందుకు పెట్టావు అని అనడంతో కార్తీకదీపం అన్నది ఆ నాటకం పేరు అని అంటుంది దీప.

Advertisement

అంటే కార్తీక్ అంటే నేను దీప అంటే నువ్వు మన ఇద్దరి భార్య భర్తల కథ అని అందరికీ చెప్పాలి అనుకుంటున్నావా అంటూ కోప్పడతాడు కార్తీక్. దాంతో దీప అలా కాదు డాక్టర్ బాబు అని చెప్పినా కూడా కార్తీక్ వినిపించుకోకుండా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ తర్వాత దీప వాళ్ళ అన్నయ్య కార్తీక్ నచ్చజెప్పి కూర్చోబెడతాడు. ఇంతలోనే నాటకం మొదలవుతుంది.

Karthika Deepam serial Sep 27 Today Episode: కారు డిక్కీలో కనిపించిన శౌర్య.. షాకైన మోనిత.. 

అప్పుడు గతంలో జరిగిన విషయాలు అన్నీ నాటక రూపంలో ఒక్కొక్కటిగా ప్రదర్శిస్తూ ఉండగా కార్తీక్ తన గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ గతంలో తాను దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాను అనే స్టేజ్ పై ఒక వ్యక్తి చెప్పడంతో ఆ మాటకు కార్తీక్ షాక్ అవుతాడు. తర్వాత నెమ్మదిగా తన గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా దీప వాళ్ళ అన్నయ్య ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు.

Advertisement

ఇక రేపటి ఎపిసోడ్ లో దీప సీరియల్ దిగి వెళ్ళిపోతూ ఉండగా కార్తీక్ దీప వెళ్లొద్దు దీప అని గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. అప్పుడు దీప ఏడుస్తూ టెన్షన్ పడుతూ కార్తీక్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అప్పుడు కార్తీక్ గురించి దీప డాక్టర్ తో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే మోనిత అక్కడికి వస్తుంది. అప్పుడు కార్తీక్ అని గట్టిగా అరవడంతో సైలెంట్ గా ఉండమని సైగలు చేస్తుంది వంటలక్క. అప్పుడు కార్తీక్ కీ మెలకువ రావడంతో దీప నేను గుర్తున్నానా డాక్టర్ బాబు అని అనడంతో దీప అని పిలుస్తాడు కార్తీక్. దాంతో షాక్ అవుతుంది.

Read Also : Karthika Deepam: గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు..వంటలక్కని దీప అని పిలిచిన కార్తీక్..?

Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు