Karthika Deepam serial September 28 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో డ్రామా మొదలుగా కార్తీక్ ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో దీప,కార్తీక్ కీ ఎలా అయినా గతం గుర్తుకు వచ్చేలా చేయాలి అని గతంలో జరిగిన సంఘటనలను నాటకం రూపంలో చూపిస్తుంది. అది చూసిన కార్తీక్ గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు దీప గతంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు చెప్పిన డైలాగులు చెప్పడంతో కార్తీక్ తల పట్టుకుని జరిగినంత గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.
ఆ తర్వాత దీప తనకు మరొక బిడ్డ పుట్టింది అని సౌర్య, హిమ ల గురించి చెప్పగాహిమ హిమ అంటూ రెండు మూడు సార్లు తలచుకొని మళ్లీ తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సౌర్య తనని నాన్న అన్న విషయాన్ని గట్టిగా తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ వైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఇద్దరూ అలాగే చూస్తూ ఉంటారు.
నాటకానికి కాస్త మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో వెంటనే కార్తీక్ ఈ సౌర్య ఎవరు అని అడగగా తర్వాత నాటకం చూడని డాక్టర్ బాబు మీకే అర్థమవుతుంది అని అంటుంది. ఆ తర్వాత మధ్యలో మోనిత పాత్ర ను నాటక రూపంలో చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మోనిత కృత్రిమ గర్భం తెచ్చుకుంది అని అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత మౌనిత కార్తీక్ కలిసి పూజ చేసినట్టుగా నాటకం రూపంలో చూపించడంతో కార్తీక్ కూడా తన గతాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చిక్మంగళూరు కి సన్నివేశాలు కూడా నాటక రూపంలో చూపించడంతో కార్తీక్ తన గతాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
Karthika Deepam serial Sep 28 Today Episode : కార్తీక్ గతం గుర్తు..దీప ఎమోషనల్
ఆ తర్వాత దీప నుంచి వెళ్ళిపోతూ ఉండగా గతం గుర్తు తెచ్చుకున్న కార్తీక్ దీప దీప అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు కార్తీక్ కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో దీప ఎమోషనల్ అవుతూ హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్తుంది. మరొకవైపు మోనిత సౌందర్య సౌర్య ల గురించి ఆలోచిస్తూ ఎలా అయినా కార్తీక్ ని దూరం తీసుకెళ్లాలి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత కార్తీక్ కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా ఇందులో శివ అక్కడికి వచ్చి మేడం సార్ లేడు మేడం ఆ వంటలకు వచ్చి తీసుకెళ్ళింది అనడంతో శివని కొడుతుంది. తర్వాత కమ్యూనిటీ హాల్లో నాటకం వేస్తుంటే అక్కడికి వెళ్లారు అని తెలుసుకున్న మోనిత అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఎవరు ఉండరు. రేపటి ఎపిసోడ్ లో దీప కార్తీక్పిలుచుకొని హాస్పిటల్ కి వెళుతుంది. అప్పుడు కార్తీక్ గతం గుర్తుకు వచ్చుంటుంది అని దీప ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే కార్తీక్ కళ్ళు తెరుస్తాడు. అప్పుడు అక్కడికి మోనిత వస్తుంది.
Read Also : Karthika Deepam serial Sep 27 Today Episode: గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు.. షాక్ లో మోనిత..?