...

YS jagan : రూటు మార్చిన జగన్.. ఆ సామాజిక వర్గమే టార్గెట్!

YS jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూటు మార్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలంటే కొన్ని పాత సెంటిమెంట్లను పక్కకు పెట్టాలని భావిస్తున్నారట. 2019 ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ మీద వ్యతిరేకతతో పాటు రాజన్న కొడుకుకు ఒకసారి అవకాశం ఇద్దామని భావించి ఓట్లు వేశారంటూ అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఏదిఏమైనా జగన్ పాదయాత్ర కూడా ఆయన అధికారంలోకి రావడానికి చాలా సహాయం చేసింది. అయితే, ప్రస్తుతం జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. అయితే, వైసీపీ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ చరిష్మానే గెలిపిస్తుంది..?
గత ఎన్నికల్లో ప్రజలు జగన్ మొహం చూసే ఓట్లు వేస్తారనేది అక్షర సత్యం. రాబోయే ఎన్నికల్లోనూ జగన్ పరిపాలన, సంక్షేమ పథకాలను చూసే ప్రజలు ఓట్లు వేస్తారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రజలకు తమ ఎమ్మెల్యేలతో సంబంధం లేదు. వారికి జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. అది సంక్షేమ పథకాల వల్ల కావచ్చు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల అయినా కావచ్చు. ఆయన ఈసారి ప్రజల్లోకి రాకపోయినా, పెద్దగా ప్రచారం చేయకపోయినా మరోసారి జగన్ కు ప్రజలు అవకాశం ఇస్తారని అందరూ అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీకి బెనిఫిట్ చేసే వారిని, ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను, ప్రజల నుంచి వ్యతిరేకత కల్గిన వారిని పక్కన పెట్టాలని చూస్తున్నారట.. ప్రధానంగా కాపు సామాజికవర్గం బలంగా ఉన్న చోట వారికే టిక్కెట్లు కేటాయించాలనుకున్నట్టు తెలిసింది. గోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం అధికంగా ఉంటుంది కావున, వారికే ఈసారి టిక్కెట్లు ఖాయం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇక రాయలసీమకు వస్తే జగన్ మరో కొత్త ప్రయోగం చేయనున్నారని ఏపీలో రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అనంతపురం నియోజకవర్గంలో ఈసారి కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కాకుండా కాపు సామాజిక వర్గానికే జగన్ టికెట్ కేటాయించాలని అనుకుంటున్నారట.. ఇక్కడి నుంచి పోటీ చేసిన అనంత వెంకట్రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చి.. బలమైన కాపు సామాజికవర్గం నాయకుడికి ఈసారి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది.

అదే జరిగి వచ్చే ఎన్నికల్లో జగన్ నిలబెట్టిన అభ్యర్థి గెలిస్తే దశాబ్దాల తర్వాత కాపు నేత ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో చీలిక తెచ్చేందుకే జగన్ ఈ ప్రయోగానికి సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
Bhuma Akhila Priya : టీడీపీకి మరోషాక్.. జనసేనలోకి భూమా అఖిలప్రియ ఫ్యామిలీ..?