prashant kishor team : ఏపీ రాజకీయాల్లో మరోశకం ప్రారంభం కానుంది. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ఏపీలో అడుగుపెట్టనున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో ఏవిధమైన అంచనాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? లేదా అనే విషయాన్ని ఈ బృందం ముందుగా పరిశీలన జరపనుంది. ఆ తర్వాత నివేదికను సీఎం జగన్‌కు పీకే టీం అందించనుంది.
అందుకోసమే సీఎం జగన్ రెండున్నరేళ్ల ముందు నుంచే రాబోయే ఎన్నికల కోసం ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీంను ఇప్పుడు రంగంలోకి దింపితేనే పార్టీకి బెనిఫిట్ అని ముఖ్యమంత్రి జగన్ భావించారట.. పీకే టీం వచ్చి రాష్ట్రంలో సెటిల్ అయి, నివేదికలు ఇవ్వడం ప్రారంభించే వరకు మరో ఆరునెల సమయం పడుతుంది. అప్పటికీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో పీకే బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా పార్టీలో ప్లస్ ఎంటీ.. మైనస్ ఎంటీ అని అనలైజ్ చేసి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలిసింది.
అయితే, పీకే టీం రాష్ట్రంలో అడుగుపెట్టాక వారిని సమన్వయం చేసే బాధ్యతలను జగన్ ఓ కీలక నేతకు అప్పగించనున్నారని తెలుస్తోంది. పీకే టీం ఇచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సీఎంకు వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా వైసీపీని విపక్షాలు ఏ విషయంలో టార్గెట్ చేయనున్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి.
ప్రజలకు ఎలాంటి భరోసా ప్రభుత్వం తరఫున అందాలనే విషయాలపై ప్రశాంత్ కిషోర్ టీం అధ్యయనం చేయనుందని తెలుస్తోంది. ఇక వైసీపీ సోషల్ మీడియాను పీకే టీం తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతిపక్షాలకు దీటుగా కౌంటర్ ఇవ్వనున్నదట.. మొత్తంగా ఏపీలో మరోసారి ఫ్యాన్ గాలి వీచేందుకు జగన్ ముందస్తు ప్రణాళికలు చూస్తుంటే ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also : MLC Kavitha : ప్లీనరీలో మచ్చుకైనా కనిపించని కవితక్క.. కేటీఆరే కారణమా..? అసలు ఏమైంది?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world