Ennenno Janmala Bandham : ఆదిత్య, ఖుషి మధ్యలో నలిగిపోతున్న యష్.. సంతోషంలో వేద..?

Ennenno Janmala Bandham Nov 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో యష్, ఇంటికి రావడంతో అది చూసి వేద సంతోషపడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వేద భోజనం తీసుకొని వచ్చి ఖుషి ముందు పెట్టగా అక్కడ పెట్టావ్ ఏంటి అమ్మ తినిపించు అని అంటుంది. ఇప్పుడు వేద ఖుషి నువ్వు పెద్ద దానివి అవుతున్నావు తినడం అలవాటు చేసుకోవాలి అని అంటుంది. కానీ కృషి మాత్రం లేదు అమ్మ నువ్వు చెప్పిన అన్ని పనులు చేస్తాను ఇది మాత్రం చేయను అని అంటుంది. అప్పుడు వేద సరే అని ఖుషి కి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు వారిద్దరు సంతోషంగా ఉండగా ఇంతలో ఖుషి అమ్మ రోజు స్కూల్ కి వెళ్లి బోర్ కొడుతుంది ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దాం అని అంటుంది.

Ennenno Janmala Bandham Nov 3 Today Episode
Ennenno Janmala Bandham Nov 3 Today Episode

నువ్వు నేను డాడీ ముగ్గురం కలిసి పిక్నిక్ కి వెళ్దాం అని అంటుంది ఖుషి. వెళ్దాం అమ్మ అని ఖుషి మారాం చేయడంతో సరే వెళ్దాం అని అంటుంది వేద. అప్పుడు వేద,యష్ గురించీ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. మరొకవైపు యష్ కారులో వస్తూ ఎలా అయినా వేద అలకను తీర్చాలి నా మీద పీకల వరకు కోపంతో ఉంది అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు వేద ఖుషి ఇద్దరూ పిక్నిక్ గురించి మాట్లాడుతూ యష్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే వస్తాడు.

అప్పుడు యష్ మల్లెపూలు తేవడం చూసి వేద ఆశ్చర్య పోతుంది. అప్పుడు వేద సంతోషంగా ఉండటం చూసి యష్ ఆశ్చర్యపోతాడు. మరొకవైపు ఆదిత్య యష్ ని గుర్తు తెచ్చుకొని మమ్మీ అని గట్టిగా అరిచి మాళవిక దగ్గరికి వెళ్లి అమ్మ నాకు భయంగా ఉంది నువ్వు ఇక్కడే పడుకో అని అంటాడు. అమ్మ మనం ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దామా నాకు ఇక్కడే ఉంటే భయం చేస్తుంది అని అనడంతో ఏం కాదు అని మాళవిక ధైర్యం చెబుతూ ఉంటుంది. అప్పుడు నేను కూడా కుషిని చాలా మిస్ అవుతున్నాను అది ఎక్కడికైనా అందరం కలిసి వెళ్దాం అని అంటుంది.

Ennenno Janmala Bandham : చిక్కుల్లో యష్…

అప్పుడు ఆదిత్య ఎలా అయిన నాన్న నేను ఒప్పిస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. మరొకవైపు ఖుషి ఆనందంగా డాడీ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని ఆనందపడుతూ ఉండడంతో ఏంటి తల్లి అంత సంతోషంగా ఉన్నావు ఏంటి ఆ గుడ్ న్యూస్ అని అంటాడు. అప్పుడు వేద ఖుషి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని ఒకరి మీద ఒకరుచెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఖుషి నువ్వు నేను అమ్మ కలిసి పిక్నిక్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనడంతో సరే అని అంటాడు.

అప్పుడు అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఖుషి సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలోనే యష్ కి ఆదిత్య ఫోన్ చేస్తాడు. నాన్న నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను అని అనగా చెప్పు అని యష్ అడగడంతో నేను మీతో కలిసి కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అందంతో సరేనా నీతో కలిసి టైం స్పెండ్ చేయడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు సరే అని మాట ఇస్తాడు యష్.

అప్పుడు ఆదిత్య నువ్వు నేను కృషి మాళవిక అమ్మ కలిసి వెళ్దాం అనటంతో యష్ షాక్ అవుతాడు. మరోవైపు ఖుషి అమ్మ నాన్న నీకోసం మల్లెపూలు తెచ్చారు పెట్టుకో అమ్మ అని అంటూ అంటుంది. ఒకవైపు ఆదిత్య ప్లీజ్ నాన్న నా కోసం టూర్ కి ఒప్పుకోండి అనటంతో యష్ చేసేది ఏమీ లేక సరే అది అందరం కలిసి వెళ్దాం అని అంటాడు. మరొకవైపు యష్ టూర్ కి ఒప్పుకున్నందుకు కుషి సంతోషపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య కూడా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి ఖుషి ని పిలుచుకొని వెళ్లాలా? ఆదిత్య అని పిలుచుకొని వెళ్లాలా అని ఆలోచిస్తూ చూసాను పడుతూ ఉంటాడు.

Read Also : Intinti Gruhalakshmi : అభి పై మండిపడిన అంకిత.. అనసూయని రెచ్చగొడుతున్న లాస్య..?