Ennenno Janmala Bamdham Nov 1Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ యష్ ని వేద నిలదీస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో యష్ వేదతో మాట్లాడాలి అని చూస్తుండగా వేద మాత్రం ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వేదా కళ్ళ ముందు కనిపిస్తున్న ఇంకా ఏం చెప్తారు మీరు అని అంటుంది. నిన్నటి వరకు ఆ మాళవికను అసహ్యించుకున్న మీరు ఈరోజు కలుసుకున్నారు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా ఫోన్ కాల్స్ మెసేజెస్, కార్ లలో కూడా తిరుగుతున్నారు అని అంటుంది వేద. మరి నేను ఏమని అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి వింటాను అని అనగా వెంటనే చూసేవాన్ని నిజాలు కావు వేదా అని అంటాడు.
అప్పుడు వేద అయినా మిమ్మల్ని నిలదీయడానికి నేను ఎవరిని మన మ్యారేజ్ అగ్రిమెంట్ లో నేను మిమ్మల్ని నిలదీస్తాను అని రాసుకోలేదు కదా అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నీ సంజయిసి నాకు అవసరం లేదు అని వేద అనగా చెప్పాల్సిన అవసరం నాకు ఉంది అని అంటాడు యష్. అప్పుడు ఒక మాట కరెక్ట్ గా చెప్తాను వేదనేను మాళవిక కలిసి ఆదిత్య ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము అనటంతో వేద ఆశ్చర్య పోతుందీ.
ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఆదిత్య ఇబ్బందుల్లో పడతాడు వేద అని అంటాడు యష్. పనిచేయడం నాకు ఇష్టం లేదు నువ్వు ఎంత బాధ పడుతున్నావో దానికి పది రెట్లు నేను కూడా బాధపడుతున్నాను అని అంటాడు యష్. ఈ రహస్యం నేను నీకు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ ఈ రహస్యం ఎప్పుడూ ఒకసారి నీకు తెలుస్తుంది. అప్పుడు నీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అంటాడు.
Ennenno Janmala Bamdham నవంబర్ 1 ఎపిసోడ్ : వేదా ఎమోషనల్..
ఈరోజు నీకు నేను పరాయిదాన్ని అయ్యాను ఆదిత్య తల్లి మాళవిక కదా అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది వేద. అప్పుడు యష్ ప్రతిసారి నువ్వు ఆ మాళవిక ని పొగుడుతూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడంతో పాటు నన్ను అవమానిస్తున్నావు అని అంటాడు. అప్పుడు యష్ మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఖుషి కి కేవలం తల్లి మాత్రమే అనటంతో వేదా ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత యష్ వేదా మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వేద ఎమోషనల్ అవుతూ ఉంటుందీ. ఆ తర్వాత సులోచన తన భర్తతో ఇంటి బయట ముగ్గు వేయిస్తూ ఉంటుంది. అప్పుడు సులోచన భర్త ముగ్గు వద్దు అని అనటంతో నిన్ను వేసి తీరుతాను అని అనగా ఇంతలోనే అక్కడికి మాలిని వస్తుంది. అప్పుడు కాసేపు వారందరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వేద జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు ఖుషి,యష్ ఇద్దరు హాల్లో కూర్చుని ఉండగా యష్ కాపీ చెప్పిన పట్టించుకోకుండా వేద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఖుషి నాన్న వెళ్లి అమ్మకు స్వారీ చెప్పు అని అంటుంది. అప్పుడు వేద యష్ కోసం కాఫీ అక్కడ పెట్టి వెళ్లిపోతుంది. మరొకవైపు అభిమన్యు మాళవిక ఇద్దరూ ప్రేమగా మాట్లాడుతూ తింటూ ఈరోజు మనిద్దరం కలిసి షాపింగ్ చేసి రెస్టారెంట్ కి వెళ్దాం అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే మాళవికకు ఫోన్ వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
Read Also : Ennenno Janmala Bandham: యష్ ని నిలదీసిన మాలిని..మాళవిక మీద కోపంతో రగిలిపోతున్న అభిమన్యు..?